Site icon HashtagU Telugu

Heart Problems: చలికాలంలో చల్ల నీరు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?

Mixcollage 18 Dec 2023 08 55 Pm 9806

Mixcollage 18 Dec 2023 08 55 Pm 9806

కొందరు చలికాలంలో కూడా చల్లనీరు తాగుతూ ఉంటారు. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మామూలుగానే చలికాలంలో బయట వాతావరణం వల్ల నీరు చల్లగా ఉంటాయి. దానికి తోడు చాలామంది ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ చల్ల నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయి. అయితే మీరు కూడా చలికాలంలో చల్లనీరు తాగుతున్నారా. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. చలికాలం చల్ల నీరు తాగడం వల్ల ఛాతిలో కఫం, తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి.

చలికాలంలో చల్లటి నీళ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యం పై ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. చల్లటి నీరు గొంతును అధికంగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. గొంతు నొప్పి వాయిస్ లాంటివి కోల్పోవడం లాంటి సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ చలికాలంలో చల్లటి నీరు గుండెపై ఎక్కువగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. హృదయ స్పందన రేట్ ను అధికం చేస్తుంది. చల్లటి నీరు జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చలికాలంలో చల్లటి నీరు బదులు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. చలికాలంలో చల్లటి నీరు తీసుకోవడం వలన దంతాలు దెబ్బతింటాయి.

దంతాలలోని నరాలు బలహీన పడిపోతాయి. అలాగే చల్లటి నీరు మీ కడుపులో హాని కలిగిస్తూ ఉంటుంది. దాంతో పాటు కడుపు నొప్పి, వికారం కూడా వస్తాయి. కాబట్టి చలికాలంలో గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే కేవలం రుచి కోసమే అలవాటు కోసమే తీసుకోకండి. చల్లని నీరు శరీరానికి చాలా రకాలుగా హానికరం చేస్తాయి. కాబట్టి చలికాలంలో గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలి. కాబట్టి చలికాలంలో తెలిసి తెలియకుండా కూడా చల్లని నీరు అస్సలు తాగకండి. ఇలా తాగడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టే అవుతుంది.