Healthy Heart: కోడిగుడ్డు….గుండెకు వెరిగుడ్డు..!!

కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ అధికమోతాదులో ఉంటుంది. ఇతర పోషకాలు కూడా తగినమోతాదులో ఉంటాయి.

  • Written By:
  • Publish Date - June 1, 2022 / 10:31 AM IST

కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ అధికమోతాదులో ఉంటుంది. ఇతర పోషకాలు కూడా తగినమోతాదులో ఉంటాయి. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల కోడిగుడ్డు తినడం మంచిదేనా..?ప్రమాదమా? దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. అంతేకాదు..భిన్నఫలితాల్లో కూడా అధ్యయనాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ మధ్యే నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం గుడ్లను మోస్తరుగా తీసుకుంటే గుండె కు మంచి చేసే మెటాబాలిటీలను పెంచుతాయని గుర్తించింది. ఈ అధ్యయనాల ఫలితాలను ఈ లైఫ్ అనే జర్నల్లో ప్రచురించారు. దీనికంటే ముందు 2018నాటి ఒక అధ్యయనం గురించి చెప్పుకోవాలి. చైనాలో 5లక్షల మందిపై చేసిన అధ్యయనంలో ప్రతిరోజూ గుడ్లు తినేవారికి…తిననివారిలో పోలిస్తే గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తాజా అధ్యయనం ప్రకారం దీనికి కొనసాగింపు అని చెప్పుకోవచ్చు.

చైనాలో 4,778మందిని సెలక్ట్ చేసి వారిపై తాజా అధ్యయనం నిర్వహించారు. అందులో 3,401 మందికి గుండె జబ్బులు ఉన్నాయి. మిగతావారికి 1,377మంది ఆరోగ్యవంతులు. వీరి నుంచి తీసుకున్న ప్లాస్మా శాంపిల్స్ లో 225 మెటాబాలిటీలను అంచనా వేశారు. అందులో గుడ్లు తినడంతోసంబంధం ఉన్న 24 మెటాబాలిటీలను గుర్తించారు. ఎవరైతే గుడ్లను తీసుకుంటున్నారో…వారి రక్తంలో అపోలిపో ప్రొటీన్ఏ1 ఎక్కువ పరిమాణంలో ఉంటోంది. మంచి కొలెస్ట్రాల్ అని చెప్పుకునే హై డెన్సిటీ లిపో ప్రొటిన్ నిర్మాణానికి అపోలిపో ప్రొటీన్ ఏ1 కీలకం. దీన్ని మంచి లిపో ప్రొటీన్ అని కూడా అంటారు. కాబట్టి మోస్తరుగా గుడ్లు తినే వారిలో హెచ్ డీఎల్ మాలిక్యూల్స్ మరింతగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో ఉన్న అధిక కొలెస్ట్రాలో ను బయటకు పంపిస్తాయి. దీంతో రక్తప్రవాహంలో అడ్డంకులు ఏర్పడి గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుందని పరిశోధకులు తెలుసుకున్నారు.

కాగా గుండె జబ్బుకు దారితీసే 14 మెటాబాలిటలను కూడా గుర్తించారు పరిశోధకులు. గుడ్లు తక్కువగా తినే వారిలో మంచిదైనా అపోలిపో ప్రొటోన్ ఏ1 తక్కువ ఉండటమే కాదు…హానిచేసే మెటాబాలిటీలు ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించారు.