Heart Health Tips: ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా.. అయితే ఇవి పాటించాల్సిందే?

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలిలో ఆహారపు అలవాట్లలో చాలా వరకు మార్పులు వచ్చాయి. ఈ

  • Written By:
  • Publish Date - December 12, 2022 / 06:30 AM IST

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలిలో ఆహారపు అలవాట్లలో చాలా వరకు మార్పులు వచ్చాయి. ఈ కారణంగా ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిలో హార్ట్ ఎటాక్ సమస్య కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో చాలామంది ఈ హార్ట్ ఎటాక్ సమస్య వల్ల మరణిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే మన కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బు ప్రమాదం ఉంటే వారితో పాటు ఇంట్లో ఉన్నవారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా గుండె జబ్బు ప్రమాదం ఉంటే కుటుంబంలో ఇతర వ్యక్తులకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది అంటున్నారు.

అలా ఇంట్లో ఎవరికైనా గుండె జబ్బు ప్రమాదం ఉంటే వారితో పాటు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మరి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శరీరంలోని రక్తంలో షుగర్ ను అదుపులో ఉంచాలి. ఎందుకంటే డయాబెటిస్ వచ్చిన వారికి గుండె జబ్బులు కూడా వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్న లేదంటే అంతకుముందు ఎవరికైనా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వైద్యున్ని సంప్రదిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం తప్పించుకోవచ్చు.

అదేవిధంగా శరీర బరువును కూడా అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అధికంగా బరువు పెరగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలచుతాయి. కాబట్టి శరీర బరువును పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవాలి. బరువు ఎక్కువగా పెరగడం వల్ల గుండె జబ్బుల సమస్యలు మరింత పెరుగుతాయి. ఇంట్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వీలైనంత వరకు సిగరెట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే స్మోకింగ్ శరీరాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా దానివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు కూడా వస్తాయి. కాబట్టి గుండె జబ్బుల ప్రమాదంతో బాధపడుతున్న వారు వీలైనంతవరకు స్మోకింగ్ కి దూరంగా ఉండాలి. అదే విధంగా ఆల్కహాల్ కి కూడా దూరంగా ఉండాలి. గుండె జబ్బుల ప్రమాదం ఉన్నవారు కచ్చితంగా ఆల్కహాల్ కి దూరంగా ఉండాల్సిందే. లేదంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి.