ప్రస్తుత రోజుల్లో చాలామందిని ఎక్కువగా పీడిస్తున్న సమస్యలలో గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఒకటి. ప్రతి ఏడాది కొన్ని వేల మంది గుండెకు సంబంధించిన సమస్యల కారణంగానే మరణిస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో కేవలం 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చేవి. కానీ ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కూర్చున్న చోటే కూర్చున్నట్టుగా హార్ట్ స్టోక్ వచ్చి చనిపోవడం లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. హార్ట్ ఎటాక్ లతో ప్రాణాలు కోల్పోతున్నారు. నిల్చున్న చోటే కుప్పకూలిపోతున్నారు.అయితే ఇందుకు గల కారణం మన ఆహారపు అలవాటు జీవనశైలి.
ముఖ్యంగా కొన్ని ఆహారాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా గుండెపోటు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా ప్రేరేపిస్తాయట.అంతే కాకుండా గుండెను బలహీనం చేసి, మనకు ముప్పు తెస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. ఉప్పులేని పప్పు కూడు రుచిగా ఉంటుంది. ఇది నిజమే. కానీ అలా అని ఎక్కువగా ఉప్పు తీసుకుంటే మాత్రం గుండెకు ముప్పు తప్పదట. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుందట. ఇది గుండె పోటుకు ప్రధాన కారణం అని చెబుతున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట. కాబట్టి ఈ ఆహారాలను తినడం మానుకోవడం మంచిది.
అలా అని ఉప్పు తినడం పూర్తిగా మానేసినా కూడా సమస్యలు వస్తాయట. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఎంత ప్రమాదమో చక్కెర ఎక్కువ తీసుకున్నా అంతే ప్రమాదమట. ఉప్పు అయినా కాస్తో కూస్తో శరీరానికి అవసరం కాబట్టి మితంగా తీసుకోవాలి. ఈ చక్కర అయితే పూర్తిగా మానేసినా ఎలాంటి నష్టం ఉండదట. కానీ ప్రతీ రోజూ తీసుకుంటే మాత్రం గుండెను ప్రమాదంలో పడేసినట్లే అని చెబుతున్నారు. మరీ ఎక్కువగా తీసుకునేవాళ్లు అయితే కాస్త ఆలోచించాల్సిందే అని చెబుతున్నారు. ఎందుకంటే చక్కెర అధికంగా తీసుకోవడం బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులకు దోహదం చేస్తుందట.
స్వీట్లు, శీతల పానీయాల ఆకర్షణ ఉన్నప్పటికీ, వాటిని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాలు డైలీ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలా అనీ మరీ ఎక్కువగా ప్రోటీన్ తీసుకోకూడదట. ప్రోటీన్ అవసరమే అయినప్పటికీ, దానిని అధికంగా తీసుకోవడం మీ మూత్ర పిండాలను దెబ్బతీస్తుందట. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందట. కాబట్టి ప్రోటీన్ మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్‌లు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయట. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయట. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, రెడ్ మీట్, పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు, హైడ్రోజనేటెడ్ నూనెలను తగ్గించాలని చెబుతున్నారు.