ప్రస్తుత కాలంలో జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపం వల్ల ఆరోగ్యంగా కనిపించే వాళ్లకే ఆకస్మికంగా హార్ట్ ఎటాక్ (Heart Attack) వచ్చే ప్రమాదం ఎక్కువైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు లేకపోయినా గుండె విద్యుత్ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడం వల్ల గుండె లయ తప్పి అకాల మరణం సంభవించవచ్చు. ముఖ్యంగా “వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్” వంటి పరిస్థితుల్లో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఇది ఆకస్మిక గుండెపోటుకు ప్రధాన కారణంగా ఉన్నట్టు పరిశోధనలతో తెలుస్తోంది.
CM Revanth Reddy : తెలంగాణలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో
కొంతమందిలో జన్యుపరమైన కారణాలతో గుండె కణజాలాలు బలహీనపడతాయి. వీరిలో సోడియం, పొటాషియం మార్గాలు సరిగా పని చేయకపోవడం వల్ల గుండె విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే మయోకార్డిటిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గుండె కండరాల వాపుకు దారి తీసి, అరిథ్మియాల వల్ల హార్ట్ ఎటాక్ సంభవించే అవకాశముంది. కొవిడ్-19 తర్వాత ఈ సమస్యలు మరింతగా పెరిగాయని పలు అధ్యయనాల్లో తేలింది. అలాగే యాంటీబయాటిక్స్, యాంటీహిస్టమిన్ మందులు కూడా విద్యుత్ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చునని హెచ్చరిస్తున్నారు.
జంక్ ఫుడ్, డీప్ ఫ్రై ఆహారం, అధిక కొవ్వు, మైదా పదార్థాల వినియోగం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇది గుండెకు రక్త సరఫరా చేసే ధమనులను మూసివేసి గుండెపోటుకు దారితీస్తుంది. అలాగే పొగతాగడం, మద్యపానం, ఎక్కువ ఉప్పు, చక్కెర తీసుకోవడం, ఒత్తిడి, నిద్రలేమి కూడా గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ లేకుండా తీవ్రమైన వ్యాయామం అకస్మాత్తుగా చేస్తే కూడా గుండె విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి వచ్చి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.