Site icon HashtagU Telugu

Heart Attack Problems: కాఫీలు, టీలు తాగుతున్నారా.. అయితే గుండెపోటు రావడం ఖాయం?

Mixcollage 07 Dec 2023 06 04 Pm 224

Mixcollage 07 Dec 2023 06 04 Pm 224

ప్రస్తుత రోజుల్లో మనుషులు టీ, కాఫీ లకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే టీ కాఫీలకు బానిసలు అయిపోయారు అని చెప్పవచ్చు. కనీసం రోజులో ఒక్కసారైనా కాఫీ స్వీటీ టీ తాగనిదే రోజు గడవని వారు కూడా ఉన్నారు. అయితే ఇంకొందరు అయితే ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే లోపు కనీసం నాలుగు అయిదు సార్లు అయినా కాఫీలు తాగుతూ ఉంటారు. గ్లాసులకు గ్లాసులు కాఫీలు టీలు తాగిస్తూ ఉంటారు. అయితే కాఫీలు టీలు తాగడం మంచిదే కానీ అతిగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. కానీ చాలామంది ఈ విషయాన్ని పెడచెవిన పెట్టేస్తున్నారు.

వైద్యుల మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఇష్టం వచ్చిన విధంగా కాఫీలు టీలు తాగేస్తుంటారు. ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనలలో తేలిన విషయం ఏమీ అనగా ఎక్కువగా టీ పాటు కాఫీలు తాగే వారిలో చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయట. ప్రధానంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో పాటు గుండెపోటు జబ్బులు కూడా వస్తున్నట్లు తెలిపారు వైద్యులు. మరి కాఫీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం… కాఫీలో కనిపించే డైరెక్టర్ ఎఫ్ఎం కొలస్ట్రాల్ లెవెల్స్ పెంచడానికి ముఖ్య కారణం అవుతుంది. మరిగించిన కాఫీ, ఫ్రెంచ్ ఫ్రెష్ కాఫీ, టర్కీస్ కాఫీలు తక్కువగా తీసుకోవడం చాలా మంచిది.

అలాగే ఫిల్టర్ కాఫీ ఇన్స్టెంట్ కాపీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా కాఫీలు తీసుకోకూడదు. అలాగే ఎక్కువసేపు కూర్చోకుండా ఉండాలి.అయితే కాఫీకి కొలెస్ట్రాల్ కు కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారా కాఫీ నీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని సీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. చాలామంది పురుషులలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి అతిగా కాఫీ తాగడమే కారణం అంటున్నారు వైద్యులు. కాఫీ గింజలలో ఉండే ఫాస్ట్. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచడానికి ముఖ్య కారణం అవుతుంది. కావున ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కాఫీ టీ లకి దూరంగా ఉండాలి. కొన్ని కొన్ని సార్లు కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు వైద్యులు.