Hot Water: అయ్య బాబోయ్.. వేడి నేటితో స్నానం చేస్తే అన్ని రకాల ప్రయోజనాలా?

సాధారణంగా కొంతమంది చల్లని నీటితో స్నానం చేస్తే మరి కొంతమంది వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. కొంతమంది చలికాలం, ఎండాకాలం రెండు కాలాల్లో కూడా

  • Written By:
  • Updated On - May 2, 2023 / 05:07 PM IST

సాధారణంగా కొంతమంది చల్లని నీటితో స్నానం చేస్తే మరి కొంతమంది వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. కొంతమంది చలికాలం, ఎండాకాలం రెండు కాలాల్లో కూడా చల్ల నీటితో స్నానం చేస్తుంటారు. కానీ చలికాలం చల్లని నీటితో స్నానం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. కాస్త గోరు వెచ్చగా ఉన్న వేడినీటితోనే స్నానం చేయాలని, లేదంటే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతుంటారు. చన్నీటి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యల నుండి మొదలుకుని గుండెకు సంబంధించిన సమస్యల వరకు తలెత్తే అవకాశం ఉందని వైధ్యులు అంటున్నారు.

ఇకపోతే వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. తరచుగా వేడి నీటితో స్నానం చేస్తున్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా తరచుగా వేడి నీటితో స్నానం చేసే వారికి గుండెకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేవని ఒక సర్వేలో తేలినట్లు నిపుణులు తెలిపారు. అంతేకాకుండా వేడి నీటితో స్నానం చేయడం వల్ల గుండెపోటు నుంచి 30 శాతం వరకు తప్పించుకోవచ్చు. అంతేకాకుండా వేడి నీటితో స్నానం చేయడం అనేది ఆరోగ్యానికి అన్ని విధాల మంచిది అంటున్నారు మన నిపుణులు. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల గుండెపోటు మాత్రమే కాకుండా పక్షవాతం కూడా రాదట.

ఏళ్ల తరబడి వేడి నీటితో స్నానం చేసిన వారిలో ఎక్కువ శాతం పక్షవాతం వచ్చే అవకాశాలు లేవని వారు చెబుతున్నారు వైద్య నిపుణులు. సుదీర్ఘ కాలంగా వేడి నీటితో స్నానం చేస్తున్న కొన్ని వందల మందిని ప్రశ్నించిన సమయంలో వారికి పక్షవాతం గురించిన సమస్యలు తలెత్తలేదని వైద్యులు తెలిపారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల 60 శాతం పక్షవాతం వచ్చే అవకాశాలు లేవు అంటున్నారు నిపుణులు. వేడి నీటి స్నానం మాత్రమే కాకుండా గోరు వెచ్చని వేడి నీటితో నింపిన టబ్ లో రెగ్యులర్ గా అయిదు నుండి పది నిమిషాలు జలకాలు ఆడటం వల్ల గుండె సమస్యలు దరిచేరవట.