శీతాకాలం ప్రారంభమైంది. రోజురోజుకీ చల్లి తీవ్రత పెరిగిపోవడంతో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఉదయం 9 గంటలు అయినా సరే ఇంకా మంచు అలాగే ఉంటుంది. కొన్ని కొన్ని ప్రదేశాలలో ఎముకలు కొరికే అంత చలితో జనం అల్లాడిపోతున్నారు. దీనికి తోడు సీజనల్ వ్యాధులు కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే ఈ చలికాలంలో చల్లని తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి ఉండాల్సిందే. అందుకోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే చలికాలంలో అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య గుండె జబ్బులు. జాగ్రత్త పడకపోతే ఇది గుండెపోటుకు కూడా కారణం కావచ్చు.
ఇంతకుముందు వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వారు గుండె పోటుకు గురవుతున్నారు. చలికాలంలో చలిగాలుల కారణంగా గుండెలోని సిరలకు రక్త సరఫరా సరిగా జరగదని, దీనివల్ల బీపీ పెరిగి అక్కడ గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ సీజన్ లో చలి, వాయు కాలుష్యం రెండింటి వల్ల కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వాయు కాలుష్యం కూడా శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె పోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుందట. ఎందుకంటే కాలుష్య కణాలు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల లోకి ప్రవేశిస్తాయి. ఈ కణాలు రక్తంలో నిక్షిప్తమై సిరల్లో అడ్డంకిని కూడా కలిగిస్తాయి. దీంతో రక్త సరఫరా సక్రమంగా జరగడం లేదు.
దీంతో గుండెపై ఒత్తిడి పెరిగి గుండెపోటు రావచ్చని చెబుతున్నారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం లేదా ఊబకాయం ఉన్నవారికి శీతాకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ వ్యక్తులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అయితే గుండెపోటు వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్న విషయానికి వస్తే.. ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి అనుభూతి, నొప్పి ఛాతీ నుండి ఎడమ చేయి లేదా వైపుకు వెళుతుంది.
అలాగే శ్వాసకోశ ఇబ్బందులు, తల తిరగడం,వికారం, వాంతులు,ఛాతీలో భారం,నొప్పి లాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఏమాత్రం అజాగ్రత్త చేయకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు. చలికాలంలో గుండె జబ్బుల సమస్యను తగ్గించుకోవడం కోసం పండ్లు, కూరగాయలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే ఉదయం, సాయంత్రం తక్కువ ఉష్ణోగ్రతలలో వ్యాయామం చేయడం మానుకోవడం మంచిది. ధూమపానం,మద్యపానం చేయవద్దు. ఫాస్ట్ ఫుడ్ మానుకోవాలి. వెచ్చని దుస్తులు దరించాలి. అలాగే మీ బీపీని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి.