Earphones: హెడ్ ఫోన్స్ అతిగా వాడుతున్నారా? మీరు చావు అంచుల్లోకి వెళ్లినట్లే..!!

  • Written By:
  • Publish Date - November 18, 2022 / 07:26 AM IST

స్మార్ట్ ఫోన్ వచ్చాక…ఒకరితో ఒకరు పలకరింపులు కరువయ్యాయి. ప్రొద్దును లేస్తే…రాత్రిపడుకునేంత వరకు స్మార్ట్ ఫోన్లో ముఖం పెట్టడం కామన్ అయ్యింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్లు ఎక్కువగా హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వాడుతుంటారు. 90శాతం మందికి ఇవి జీవితంలో ముఖ్యంగా భాగం అయ్యాయి. హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ పెట్టుకుని ప్రపంచంతో సంబంధం లేనట్లు చాలా మంది వ్యవహారిస్తుంటారు. యూత్ అయితే ఏ పనిచేసినా..చేస్తున్నా..చెవిలో ఉండాల్సిందే.

అంతేకాదు ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే మంచి కిక్ వస్తుందని అంటుంటారు. ఎంత సౌండ్ వస్తే అంత ఈజీగా పనులు చేస్తుంటారు. అయితే ఈ హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ కారణంగా ప్రపంచంలో దాదాపు వంద కోట్లకు పైగా పిల్లలు, యువతలో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. గ్లోబల్ హెల్త్ జర్నల్లో దీనికి గురించి ప్రత్యేకంగా వివరించింది.

ప్రపంచవ్యాప్తంగా 43కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వాడకంపై కరోలినా పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. పెద్దవారిలో 80 డెసిబెల్స్, చిన్నవారిలో 75 డిసిబెల్స్ సౌండ్ మించి ఉంచకూడదని తెలిపారు. కానీ ప్రస్తుతం 105 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ తో వింటున్నట్లు పలు నివేదికలు తెలిపారు. ఇలానే కొనసాగినట్లయితే రానున్న రోజుల్లో యూత్ లో వినికిడి సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్మార్ట్ ఫోన్లు వాడకంతోపాటు హెడ్ ఫోన్స్ వాడకం చాలా వరకు తగ్గించుకోవడం మంచిదని సూచించారు. ఇప్పటికే మీరు హెడ్ ఫోన్స్ ఇయర్ బర్డ్స్ కు బానిసలైతే…చావు అంచుల్లోకి వెళ్లినట్లే. ఇప్పటికైనా ఆ అలవాటును మానుకున్నట్లయితే కొంత ప్రమాదం నుంచి బయటపడినట్లే. లేదంటే ఎవరి కర్మకు వారే బాధ్యులవుతారు.