Site icon HashtagU Telugu

Healthy Vegetables: వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయలు తప్పకుండా తినాల్సిందే.. అవేంటంటే?

Cholesterol

Healthy Vegetables

ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ఆకుకూరలు కాయగూరలతో పాటు సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే నిత్యం మనం తినే ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు చేర్చుకోవాలి. ఆకుపచ్చని కూరగాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వైద్య నిపుణులు సైతం ఆరోగ్యం కోసం ఆకుపచ్చని కూరగాయలను తినాలని చెబుతున్నారు. ఈ పచ్చని కూరగాయలు శరీరానికి మీ మేలు చేయడంతో పాటు ఎన్నో రకాల సమస్యల నుంచి బయట పడేస్తాయి. మరి ఆకుపచ్చని కూరగాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా ఆకుపచ్చని కూరగాయలలో విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి అన్న విషయం తెలిసిందే. ఇవి మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఇవి కళ్ళకు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుపచ్చని కూరగాయలలో కాకరకాయ మెంతికూర లాంటివి చేదుగా ఉంటాయి. ఇలాంటి వాటిలో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. వారిని తినడం వల్ల దంతాలు ఎముకలు బలంగా మారుతాయి. నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు బచ్చలి కూరను ఉడకబెట్టుకుని తిన్నా లేదంటే పచ్చిగా నమిలినా కూడా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

బరువు తగ్గడానికి జిమ్ లో గంటల తరబడి కష్టపడేవారు బచ్చలికూర, ఆవాలు, మెంతికూర, సోయా వంటి ఆకుపచ్చ కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మీ చెడు కొవ్వును కరిగించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. క్యాన్సర్ మహమ్మారితో బాధపడేవారు కచ్చితంగా ఆకుపచ్చని కూరగాయలను తినాలి. వాటిని తినడం వల్ల వాటిలో ఉండే ఫైబర్ ఇనుము, ఖనిజాలు,క్యాల్షియం వంటివి క్యాన్సర్ వ్యాధి నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా ఆకుపచ్చని కూరగాయలు మూత్రపిండాల్లో ఉండే రాళ్లను కూడా కరిగిస్తాయి.