ఈ మధ్య కాలంలో యువతకు గడ్డం పెంచుకోవడం అన్నది చాలా ఇష్టం. ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. గడ్డం మగవారి అందాన్ని మరింత పెంచుతుంది. అందుకోసం చాలామంది గడ్డాన్ని చాలా బాగా పెంచి రకరకాల హెయిర్ స్టైల్ చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది వయసు పెరుగుతున్న కూడా గడ్డం సరిగా రాక మీసాలు రాక తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ లోకి వెళ్ళినప్పుడు గడ్డం బాగా ఉన్నవారిని చూసినప్పుడు లోలోపల ఫీల్ అవుతూ ఉంటారు.
కొంతమందికి జన్యుపరంగా లోపం ఉండడం కారణంగా కూడా గడ్డం తక్కువగా వస్తూ ఉంటుంది. కొన్ని తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా గడ్డం పెరగకుండా చేస్తాయి. గడ్డాన్ని పెంచుకోవడం కోసం యువత మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ హెయిర్ ఆయిల్స్ బ్రీడ్ ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే గడ్డం రాలేదని ఇకమీదట అసలు బాధ పడకండి. ఎందుకంటే మీ ఇంట్లోనే దొరికే కొన్నింటిని తినడం వల్ల గడ్డం ఈజీగా బాగా పెరుగుతుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ట్యూనా.. మార్కెట్లో చాలా తక్కువ ఈ ట్యూనా చేపలు దొరుకుతూ ఉంటాయి. ఈ చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చేప తిన్న తర్వాత గడ్డం పెరుగుదలను మీరే గమనించవచ్చు. ట్యూనా చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వల్ల హెయిర్ ఫోలికల్స్ ఏర్పడతాయట. గడ్డం పెరగాలి అనుకున్న వారు ఈ చేపలను తినవచ్చు అని చెబుతున్నారు.
గుమ్మడికాయ గింజలు.. చాలామంది గుమ్మడికాయ గింజలను పారేస్తూ ఉంటారు. కానీ ఇకమీదట అలా చేయకుండా గుమ్మడికాయ గింజలను తినండి. ఎందుకంటే గుమ్మడి విత్తనాలను జింక్ అనే శక్తివంతమైన సూక్ష్మ పోషకం ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ గింజలను ఎండలో బాగా ఎండబెట్టి వేయించి ఉప్పుతో కలిపి తింటే ప్రయోజనకరంగా ఉంటుందట.
గడ్డం పెరగాలి అనుకున్న వారు మీ ఆహారంలో కొబ్బరి నూనెను చేర్చుకోవాలి. కొబ్బరి నూనె ఉపయోగించడం వల్ల గడ్డం బాగా పెరుగుతుందట. అలాగే కొబ్బరి నూనెతో మీ గడ్డాన్ని మసాజ్ చేయాలి. ఇది మీ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుందట.
అలాగే దాల్చిన చెక్క కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. కాగా దాల్చిన చెక్కను తినడం వల్ల శరీర వేడి పెరుగుతుందట. అలాగే శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందట. జుట్టు మూలాలలో రక్త ప్రవాహం మెరుగ్గా ఉండటం వల్ల ఆక్సిజన్ స్థాయిలు కూడా పెరుగుతాయని,దీంతో మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు. అయితే ఇందుకోసం మీరు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, దాల్చిన చెక్క నీళ్లు కలుపుకుని తాగితే ఎంతో మంచిదని గడ్డం పెరుగుదలలో మార్పులు మీరే గమనించవచ్చు అని చెబుతున్నారు.