Site icon HashtagU Telugu

Healthy Tips: షుగర్ తో బాధపడే వాళ్లకు సాయంత్రం పూట ఆరోగ్యకరమైన స్నాక్స్.. ఇంతకు అవేంటంటే?

How To Sprout Chickpeas At Home41 1280x720

How To Sprout Chickpeas At Home41 1280x720

Healthy Tips: ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే షుగర్ వ్యాధి అందర్నీ భయపడుతుంది. ఇష్టంగా ఏది తినాలన్నా కూడా ఎక్కడ షుగర్ లెవెల్ పెరుగుతుందో అన్న భయంతో కడుపు మాడగొట్టుకుంటున్నారు. ఎక్కువగా తిన్నా కూడా కష్టమే. కానీ మధ్యాహ్నం భోజనం తో పాటు సాయంత్రం స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఆ తీసుకునే స్నాక్స్ లో విలువలు ఉన్న ఐదు రకాల ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. ఇంతకు ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

పచ్చి బఠానీలు: సాయంత్రం లేదా మధ్యాహ్నం ఒక గిన్నె ఉడికించిన పచ్చి బఠాణీలు తీసుకోవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొద్ది మోతాదులో తీసుకున్న కూడా కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇక చక్కెర పెరుగుదలను తగ్గిస్తుంది. కేవలం పచ్చి బఠానీలే కాకుండా అందులో టమాటో, దోసకాయ, ఉల్లిపాయలతో ఉడికించిన బటానీలను కూడా తీసుకోవచ్చు.

మొలకెత్తిన శనగలు: మామూలుగా మొలకెత్తిన శనగలు ఎవరైనా తీసుకోవచ్చు. దీనిలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఇక మధుమేహంతో బాధపడే వాళ్ళు కూడా ప్రతిరోజు దీనిని పుష్కలంగా తినవచ్చు. లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇక ఈ మొలకెత్తిన శనగలను ఊరగాయ లేదా ఇతర పదార్థాలతో కలిపి తీసుకోకుండా ఉండటమే మంచిది. కనీసం అందులో ఉప్పు కూడా వేయకుండా తీసుకోవటం మంచిది.

కాబూలీ శనగలు: శనగల కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉంటాయి కాబూలీ శనగలు. దీంట్లో కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటిని నానబెట్టి పచ్చి సలాడ్ తో తీసుకోవచ్చు. కొద్ది మోతాదులో తీసుకున్న కూడా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.

కూరగాయల సూప్: పచ్చి కూరగాయలు కాకుండా కూరగాయలు సూప్ తీసుకోవడం వల్ల కూడా మంచి లాభాలు ఉంటాయి. ప్రతిరోజు కూరగాయల సూప్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందులో విటమిన్ లతోపాటు, మినరల్స్, ఖనిజాలు ఉంటాయి.

చికెన్ సూప్: మాంసాహారంలో చికెన్ సూప్ కూడా శరీరానికి చాలా మంచిది. ఇందులో చాలా రకాల ప్రోటీన్లు ఉంటాయి. సరైన యాంటీ ఆక్సిడెంట్ లో కూడా ఉంటాయి. ఇందులో మంచి ప్రోటీన్లతో పాటు విటమిన్ లో, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చక్కెరను అదుపులో ఉంచుతుంది. కాబట్టి సాయంత్రం సమయంలో ఈ ఐదు రకాల స్నాక్స్ తీసుకుంటే మంచిదని వైద్యులు తెలుపుతున్నారు.