Site icon HashtagU Telugu

Headache: తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిన్న చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే?

Mixcollage 14 Jun 2024 04 07 Pm 4883

Mixcollage 14 Jun 2024 04 07 Pm 4883

మామూలుగా మనకు అనేక సందర్భాల్లో తలనొప్పి వస్తూ ఉంటుంది. ఏదైనా విషయం గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు, హెల్త్ బాగోలేనప్పుడు, ఐ సైటు ప్రాబ్లం ఉన్నప్పుడు తల తీవ్రంగా నొప్పిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు తలనొప్పి భరించలేని విధంగా ఉంటుంది.a అయితే తల మెడ భాగాల్లో కొన్ని సున్నితమైన ప్రాంతాలు ఉంటాయి. అవి ఒత్తిడికి లోనైనా, తలలోని రక్తనాళాల మీద ఒత్తిడి పడినప్పుడు ఎక్కువగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అదేమీ పెద్ద జబ్బు కాదు. కానీ తలనొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్లు వాడి ఉపశమనం పొందడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

చాలామంది తలనొప్పి వచ్చిన ప్రతిసారి టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు. అందుకే తలనొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ల జోలికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండే ఆహార పదార్థాలతో తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. మరి ఈ తలనొప్పి తగ్గాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనకు తెలుసుకుందాం.. నిమ్మరసం తాగినప్పుడు శరీరం రిఫ్రిష్ గా అనిపిస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు కూడా ఒక గ్లాసు వేడి నీటిల కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగితే త్వరగానే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఆవు పాలు కూడా ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనవి.

గోరువెచ్చని ఆవు పాలను తాగడం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది. యూకలిప్టస్ ఆయిల్ లేదా నీలగిరి తైలం.. దీనిని ఉపయోగించడం వల్ల కూడా మనం తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు నుదుటిపై కొంచెం గంధం రాసుకుంటే తలనొప్పి తగ్గడంతోపాటు చల్లని అనుభూతి కలుగుతుంది. అల్లం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అల్లంతో పాలు లేకుండా టీ చేసుకుని తాగడం కూడా మంచిదే. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అల్లం టీ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. అల్లం టీ చేసుకునే సమయం లేకపోతే కొంచెం అల్లాన్ని నోట్లో వేసుకుని నమిలినా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడూ ఒకే గదిలో చీకటిలో ఉండటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అందుకే శరీరానికి మాత్రమే కాకుండా మానసిక వికాసానికి కూడా గాలి వెలుతురు చాలా అవసరం. తలనొప్పిగా అనిపించినప్పుడు కాసేపు బయటకు వెళ్లి అలా తిరిగి వచ్చినా సరిపోతుంది తలనొప్పికి కొబ్బరి నూనె దివ్య ఔషధంలా పనిచేస్తుంది.