మామూలుగా స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతూ ఉంటారు. కొన్ని రకాల ఆహార పదార్థాలు కచ్చితంగా తీసుకోవాలని మరికొన్ని తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. మరి గర్భిణీ స్త్రీలు తప్పకుండా తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… గర్భధారణ సమయంలో స్త్రీల శరీరానికి జింక్ ఎంతో అవసరమైన ఖనిజాలలో ఒకటి. జింక్ తల్లి, పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. ఇవి శిశువు శారీరక ఎదుగుదలకు, మెదడు ఆరోగ్యానికి ఎంతో అవసరం.
గర్భధారణ సమయంలో రోజుకు జింక్ ను 12 మి.గ్రా తీసుకోవాలట. రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, నరాల పనితీరు, జీవక్రియ రేటును పెంచడానికి జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి, జీవక్రియకు జింక్ అవసరం. జింక్ మహిళల్లో హార్మోన్ల ఉత్పత్తి, సెల్యులార్ పెరుగుదల అవసరాలకు కూడా సహాయపడుతుందట. చిక్కుళ్లు జింక్ కు మంచి మూలం. వేరుశెనగ, కాయ ధాన్యాలు, బీన్స్ మొదలైన వాటిలో గర్భిణులకు రోజుకు సరిపడా జింక్ ఉంటుంది. కాబట్టి వీటిని గర్బిణులు ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. అలాగే బాదం జీడిపప్పు వంటివి కూడా ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలని చెబుతున్నారు. ఇవి కూడా మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
అలాగే మీ బిడ్డ ఎదుగుదలకు సహాయపడతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా గర్భిణులకు ప్రయోజనకరంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిని కూడా గర్భిణులు తమ ఆహారంలో చేర్చొచ్చు. ఇవి తల్లీ, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు. గర్బిణులు రోజుకు ఒక గుడ్డైనా ఖచ్చితంగా తినాలి. గుడ్లు పోషకాల భాండాగారం. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ లు ఉంటాయి. గుడ్లలో కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము కూడా పుష్కలంగా ఉంటాయి. ఒక పెద్ద గుడ్డులో 5 శాతం జింక్ ఉంటుంది. గర్భిణులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన వాటిలో పాలు, పాల ఉత్పత్తులు కూడా ఉన్నాయి. జింక్ ఎక్కువగా ఉండే ఈ ఆహారాలను మీ ఆహారంలో చేర్చడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. అలాగే స్త్రీలు తప్పకుండా తినాల్సిన ఆహార పదార్థాలలో చికెన్ అలాగే బంగాళదుంప లు కూడా ఒక్కటి. వీటిలో జింకు పుష్కలంగా ఉంటుంది.