Healthy Foods At Night: రాత్రిపూట ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో మీకు తెలుసా?

ఉదయం మధ్యాహ్నంతో పోల్చుకుంటే మనం రాత్రిపూట తినే ఆహారం ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అన్న విషయం తెలిసిందే. అందుకే రాత్రిపూట మంచి ఆ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 02 Feb 2024 12 20 Pm 9337

Mixcollage 02 Feb 2024 12 20 Pm 9337

ఉదయం మధ్యాహ్నంతో పోల్చుకుంటే మనం రాత్రిపూట తినే ఆహారం ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అన్న విషయం తెలిసిందే. అందుకే రాత్రిపూట మంచి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. నిద్ర పోతున్న సమయంలో జీర్ణ వ్యవస్థ పని చేయాల్సి వచ్చే పదార్థాలు కాకుండా ఈజీగా అరిగి పోయే ఆహారంను తీసుకోవాలి. లేదంటే పడుకోవడానికి కనీసం గంటన్నర రెండు గంటల ముందే అయినా ఆహారంను తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల మాత్రమే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఉభకాయం నుండి మొదలుకుని పలు అనారోగ్య సమస్యలు రాత్రి భోజనం కారణంగా మొదలవుతూ ఉంటాయి.

మరి రాత్రిపూట తీసుకోవాల్సిన ఐదు రకాల ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కోడి గుడ్లు అధికంగా తింటే లావు అవుతారని అనుకుంటారు. కాని కోడిగుడ్లను రాత్రి పడుకునే సమయంలో ఎల్లో లేకుండా వైట్ వరకు తింటే ఈజీగా అరగడంతో పాటు నిద్ర బాగా పడుతుంది. నిద్ర ఎక్కువగా పోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి రాత్రిపూట పడుకునే ముందు కోడిగుడ్డు తినడం అలవాటు చేసుకోండి. వాల్‌ నట్స్ ను రెగ్యులర్ గా పడుకునే సమయంలో మితంగా తినడం వల్ల మంచి ప్రభావంను చూపిస్తాయి. శరీరం జీర్ణ క్రియతో పాటు అనేక రకారలుగా ఆరోగ్యానికి వాల్‌ నట్స్ ప్రయోజనం చేకూర్చుతాయి. గడ్డి చామంతి పూలతో చేసిన టీ ని రాత్రి సమయంలో తాగడం వల్ల తిన్న ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది.

జీర్ణ వ్యవస్థను బాగా పని చేసేలా చేయడంతో పాటు అన్ని విధాలుగా ఈ టీ ఆరోగ్యదాయకంగా పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోదక శక్తిని పెంచుతాయి..రాత్రి పడుకునే సమయంలో గ్లాస్ పాలలో తేనె మరియు రెండు లేదా మూడు చుక్కల నిమ్మ రసంను కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. నిద్ర బాగా పట్టడంతో పాటు అన్ని విధాలుగా ఆరోగ్యదాయకంగా ఉంటుంది. రాత్రి సమయంలో మూడు లేదా నాలుగు నానబెట్టిన బాదాంలు లేదా రెండు అరటి పండ్లను తినడం వల్ల కూడా పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. సుఖ నిద్రకు కూడా ఇవి చాలా సాయం చేస్తాయి. శరీరం రిలాక్స్ అవ్వడంలో వీటి ప్రాముఖ్యత చాలా ఉంటుంది. కనుక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

  Last Updated: 02 Feb 2024, 12:21 PM IST