Juices: ఎముకలు బలంగా అవ్వాలంటే ఈ 5 రకాల జ్యూసులు తాగాల్సిందే?

  • Written By:
  • Updated On - March 8, 2024 / 04:03 PM IST

సాధారణంగా అప్పుడప్పుడు మనకు కీళ్ల నొప్పులు ఎముకల నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకు గల కారణం ఎముకలు బలహీనపడటం. శరీరంలో క్యాల్షియం విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. అయితే ఎముకలు బలహీనపడినప్పుడు అందుకు తగిన విధంగా విటమిన్ డి,కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనిషి నిలబడాలి అన్న కూర్చోవాలి పని చేయాలి అన్న ఏ పని చేయాలి అన్న కూడా ఎముకలు అన్నది అవసరం. ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటేనే మనిషి కూడా స్ట్రాంగ్ గా ఉంటాడు. కీళ్ల నొప్పులు వెన్నునొప్పి సమస్యలు అలాగే ఎముకల నొప్పులు వంటివి కాల్షియం లోపం వల్లే వస్తాయి.

దీంతో ఎముకలు మరింత బలహీనంగా మారి ఏ పని చేయాలి అన్న కూడా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఎముకలు బలంగా అవడానికి 5 జ్యూస్ లు తాగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఆ జ్యూస్ లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలు.. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ డి యొక్క అద్భుతమైన మూలం పాలు. పాలు అంటే ఆవు పాలు మాత్రమే కాదు, సోయా పాలు, కొబ్బరి పాలతో సహా అన్ని రకాల పాల నుండి మనం మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే బచ్చలికూరతో సహా అనేక ఆకు కూరలతో చేసిన స్మూతీలు పోషకాలతో నిండి ఉంటాయి.

కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అదేవిధంగా క్యాలీఫ్లవర్ ను ఉడికించి తింటే కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె లభిస్తాయి. ప్రతిరోజు తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు, దంతక్షయం వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే ప్రాసెస్ చేసిన ఆరెంజ్ జ్యూస్ కొని తాగే బదులు ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో అవసరమైన కాల్షియం, విటమిన్ సి ఉంటాయి. ఇవి మన ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది. గ్రీన్ టీ తాగడం వల్ల మన శరీరం చురుగ్గా ఉంటుంది. అంతేకాకుండా కాల్షియం అవసరాన్ని తీరుస్తుంది. ఇది మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది.