ప్రస్తుత రోజుల్లో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం నానా నానా తిప్పలు పడుతున్నారు. మార్కెట్లో దొరికే రకరకాల మెడిసిన్స్ ని ఉపయోగించడంతోపాటు హోమ్ రెమిడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉన్నారు. అయితే వాటిని ఫాలో అవ్వడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలని చెబుతున్నారు. మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో తప్పకుండా కొన్నింటిని చేర్చుకోవడం వల్ల షుగర్ తప్పకుండా అదుపులో ఉంటుందట.
డయాబెటిస్ పేషెంట్లు బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాల్సిన వాటిలో రాగి ఓట్స్ దోశ ఒకటి. ఇంతకీ ఈ రాగి ఓట్స్ దోస ఎలా చేయాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా ఓట్స్ ను పాన్ లో లైట్ గా వేయించుకొని, చల్లారిన తర్వాత మిక్సీలో రుబ్బుకుని, పౌడర్ లా చేసుకోవాలి. తరవాత ఒక పాత్రలో రాగి పిండి, ఓట్స్ పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, తురిమిన అల్లం, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత మజ్జిగ, నీళ్లు కొద్ది కొద్దిగా పోసి దోసె పిండిలా కలపుకోవాలి. తర్వాత పాన్ వేడి చేసి దాని పై నూనె రాసి తయారు చేసిన మిశ్రమాన్ని దోసెలాగా పోసుకోవాలి. సింపుల్ గా ఉన్న ఈ రెసిపీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.
డయాబెటిస్ పేషెంట్లు తీసుకోవలసిన బ్రేక్ ఫాస్ట్ లలో మరొకటి రాగి ఊతప్పం కూడా ఒకటి. అయితే దీని కోసం ముందుగా సెమోలినా, పెరుగును బాగా కలపాలి. తర్వాత రాగి పిండి, పచ్చిమిర్చి, రుచికి తగిన ఉప్పు, నీళ్లు పోసి బాగా కలపాలి. ఇప్పుడు దానిని అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టి, అరగంట తర్వాత, పాన్ వేడి చేసి దానిపై నూనె రాసి తయారు చేసిన మిశ్రమాన్ని ఊతప్పంలా వేసుకోవాలి.. దానిపై సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, తురిమిన క్యారెట్ వేయండి. తర్వాత మూత పెట్టి ఉడికించాలి. ఉత్తపం ఒక వైపు ఉడికిన తర్వాత, దాన్ని తిప్పి మరోవైపు కూడా బాగా కాల్చు కోవాలి. ఈ ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటితోపాటు ఇంకా ఏ బ్రేక్ ఫాస్ట్ లు తినవచ్చు అన్న విషయానికి వస్తే.. సోయా దోస, రాగి ఇడ్లీ, వర్గు ఉప్మా, గోధుమ దోస, రాగి గంజి, మూంగ్ పప్పు దోస మొదలైనవి మధుమేహ రోగులకు అద్భుతమైన అల్పాహారాలు అని చెప్పాలి.