Popcorn: తరచూ పాప్ కార్న్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

పాప్ కార్న్.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పాప్ కార్న్ ని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - November 6, 2022 / 09:30 AM IST

పాప్ కార్న్.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పాప్ కార్న్ ని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ పాప్ కార్న్ ని ఎక్కువగా సినిమా హాల్లో ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో అలా బయటకు వెళ్ళినప్పుడు తింటూ ఉంటారు. ఎండిన మొక్కజొన్న గింజలను కాస్త నూనెలో వేయించడం వల్ల అవి పాప్కాన్లుగా తయారవుతాయి. అయితే ఈ పాప్ కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని వేయించినప్పుడు వాటిలో నెయ్యి ఉప్పు మాత్రం వేయకూడదు.

అలా వేసుకొని తింటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. పాప్ కార్న్ లో విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉండి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే పాప్ కార్న్ లో ఉండే ఫైబర్ రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా చేయడానికి పాప్ కార్న్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిలో ఉండే ఫైబర్ వల్ల మనం తీసుకున్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.

అలాగే జీర్ణక్రియ పనితీరును మెరుగుపరిచే జెర్మ్, ఎండోస్పెర్మ్ వంటివి పాప్ కార్న్ లో పుష్కలంగా లభిస్తాయి. పాప్ కార్న్ మలబద్దకం సమస్యను కూడా తొలగిస్తాయి. పాప్ కార్న్ హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు తగ్గుతాయి. పాప్ కార్న్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. పాప్ కార్న్ లో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. పాప్ కార్న్ ను తినడం వల్ల అధిక బరువు నుంచి ఈజీగా బయటపడవచ్చు. అంతేకాదు దీనిని తినడం వల్ల కండరాల బలహీనత, అంధత్వం, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచే మాంగనీస్ పాప్ కార్న్ లో పుష్కలంగా ఉంటుంది.