Health Troubles : 30 దాటిందా, అయితే మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే..!!

పురుషులతో పోల్చితే మహిళల మనస్సు, ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా 30ఏళ్లు దాటిన మహిళలను ఎన్నో సమస్యలు వేధిస్తుంటాయి.

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 03:06 PM IST

పురుషులతో పోల్చితే మహిళల మనస్సు, ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా 30ఏళ్లు దాటిన మహిళలను ఎన్నో సమస్యలు వేధిస్తుంటాయి. వీటికి ముందుగానే చికిత్స తీసుకుంటే వారు పూర్తి ఆరోగ్యంతో జీవితాన్ని లీడ్ చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 30ఏళ్ల వయస్సు దాటినమహిళలు ఏడాదికి ఒకసారి సమగ్రంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

బరువు :
వివాహం, పిల్లల తర్వాత చాలామంది మహిళలు బరువు పెరుగుతారు. ముఖ్యంగా నడుము కొలత పెద్దగా మారుతుంది. ఈ సమస్య నుంచి వెంటనే బయటకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే బరువు, కొవ్వు కారణంగా మరిన్ని సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. బరువు పెరుగుతే…జీవక్రియలు ఇంతకుముందు మాదిరిగా సాఫీగా సాగడం లేదని అర్థం చేసుకోవాలి. లేదంటే హార్మోన్లలో అసమతుల్యత వచ్చి ఉంటుంది. అందుకని కారణాన్ని గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలి.

జుట్టు రాలిపోవడం:
శరీరానికి కావాల్సిన పోషకాహారం తీసుకోవడం లేదనడానికి నిదర్శనం జుట్టు రాలిపోవడం. కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. ఆహారం, పోషకాల పరంగా ఎలాంటి లోపం లేనట్లయితే…అప్పుడు హార్మోన్లలో అసమతుల్యత లేదంటే ఒత్తిళ్లు కారణం అయ్యి ఉంటాయి.

గర్భదారణ:
కొందరు పెళ్లి అయిన 5ఏళ్లకు కూడా గర్భం రాలేదని బాధపడుతుంటారు. అయితే ఏ వయస్సు లో వివాహం చేసుకున్నారనేది కీలకం అవుతుంది. 30ఏళ్లు దాటిన తర్వాత నుంచి మహిళల్లో గర్భధారణ అవకాశాలు తగ్గుతాయి. గర్భం వచ్చినా పలు సమస్యల కారణంగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 35ఏళ్లు దాటిన తర్వాత గర్భం దల్చిచే రక్తపోటు, షుగర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

రుతుచక్రం అస్తవ్యస్తం:
30ఏళ్లు దాటిన మహిళల్లో ఎండో మెట్రియోసిస్ లేదా యుటెరిన్ ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి రుతు చక్ర తీరును పూర్తిగా మార్చేస్తాయి. హార్మోన్లలో మార్పులు కూడా దీనికి కారణం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే కారణాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

శ్వాసకోస సమస్యలు:
35 సంవత్సరాలు నిండిన తర్వాత సహజంగా ఊపిరితిత్తుల సామర్థ్యం సన్నగిల్లుతుంటుంది. కొంతమందిలో సమస్యలకు దారి తీస్తుంది. దీనికి శ్వాసకోసానికి బలాన్నిచ్చే వ్యాయామాలు చేయాలి. ఇలాంటి సమస్యల్లో ఏవి కనిపించినా…ఒకసారి వైద్య నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.