Banana: భోజనం తర్వాత అరటి పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో జీర్ణ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. కడుపునొప్పి,

  • Written By:
  • Publish Date - February 7, 2023 / 06:30 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో జీర్ణ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. కడుపునొప్పి, ఛాతిలో మంట, కడుపులో మంటగా అనిపించడం ఇలా అనేక రకాల జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. వీటిని అధిగమించాలి అంటే సరైన ఆహారం చేసుకోవడం ఫాస్ట్ ఫుడ్ ని దూరం పెట్టడంతో పాటు త్వరగా నిద్రపోవడం శారీరక వ్యాయామాలు చేయడం లాంటివి చేయాలి. ఈ జీర్ణ సమస్యల్లో ఎక్కువగా వేధించే రెండు సమస్యలు ఒకటి మలబద్దకం, రెండు ఎసిడిటీ. అయితే ఈ జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో అరటిపండు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

ఇందుకోసం భోజనం చేసిన తరువాత అరటిపండును ముక్కలు ముక్కలుగా కట్ చేసి నల్ల మిరియాల పొడి ఉప్పును చల్లి తినాలి. ఈ విధంగా తినడం వల్ల అన్నం తొందరగా జీర్ణం అవడంతో పాటు జీర్ణ సమస్యలు నయం అవుతాయి. అరటి పండ్లలో పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. కడుపు ఉబ్బరం సమస్యను నివారించడంలో పొటాషియం ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మందికి సోడియం కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. అయితే అరటి పండ్లు ఈ సమస్యను తొందరగా తగ్గిస్తాయి. చిలగడదుంపలు, పెరుగు, కేఫీర్, కూరగాయలు, పండ్లు, మూలికా టీలు, జీలకర్ర నీరు వంటి అనేక ఆహారాలు, పానీయాలు మలబద్దకాన్ని నివారించడానికి బాగా సహాయపడతాయి.

జీర్ణ సమస్యను పరిష్కరించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్నిఎక్కువగా తీసుకోవాలి. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడానికి అరటిపండు బాగానే ఉపయోగపడుతుంది. అలా అని మోతాదుకు మించి తినడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి రోజులో కేవలం రెండు అరటిపండు మాత్రమే తినాలి. మరి ముఖ్యంగా రాత్రి సమయంలో అరటి పండ్లు తినకూడదు.