Site icon HashtagU Telugu

Onions: ఉల్లిపాయ తినడం వల్ల కలిగే లాభనష్టాలు ఇవే?

Mixcollage 22 Jun 2024 11 17 Am 3416

Mixcollage 22 Jun 2024 11 17 Am 3416

ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఉల్లిపాయ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయ మన కడుపులో చల్లని అనుభూతి కలుగుతుంది. ఉల్లిపాయలో చాలా పోషక విలువలు కూడా ఉన్నాయి. ఉల్లిపాయలను తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటూ ఉంటారు. అయితే పచ్చి ఉల్లిపాయలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

పచ్చి ఉల్లిపాయలను తినేవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం క్యాన్సర్ వంటి సమస్యలను రాకుండా నివారించవచ్చు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, జ్వరంతో పాటు దగ్గును తగ్గించడానికి ఉల్లిపాయలు ఉపయోగపడతాయి. ఉల్లిపాయల్లో ఫైబర్, విటమిన్ బి, విటమిన్ బీ సిక్స్, విటమిన్ బీ నైన్, ఖనిజ లవణాలు ఎన్నో ఉంటాయి. ఇక అటువంటి ఉల్లిపాయలను మనం కూరలలో వండుకుని తినడమే కాకుండా, పచ్చి వాటిని కూడా తీసుకోవడం మంచిది. ఉల్లిపాయలలో కొలెస్ట్రాల్‌ ను తగ్గించే గొప్ప గుణం ఉంటుంది.

ఇవి మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి.
శరీరంలో ఉండే అనేక అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడటానికి ఉల్లిపాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి రోజూ ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటంలో ఎంతగానో ఉపయోగపడతాయి. నిత్యం ఉల్లిపాయలను తిన్నప్పటికీ వాటిని మితంగానే ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఉల్లిపాయ మంచిదే కదా అని అతిగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. అతిగా ఉల్లిపాయలను తింటే కొన్ని రకాల అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది.