Weight Loss: వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా.. అయితే కొబ్బరినీళ్ళతో ఇలా చేయండి?

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల చిట్కాలు

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 05:47 PM IST

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల చిట్కాలు పాటించడంతో పాటు జిమ్ కి వెళ్లడం కసరత్తులు చేయడం, ఎక్సర్సైజులు చేయడం, డైట్ ను ఫాలో అవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఫలితం లభించదు. అలాంటప్పుడు అధిక బరువును ఎలా తగ్గించుకోవాలో అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే కొబ్బరి నీళ్లతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటున్నారు వైద్యులు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనారోగ్యం బారిన పడిన వారికి కొబ్బరి నీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లు మన శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని చల్ల బరుస్తాయి. శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. కొబ్బరి నీళ్ళు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే కొబ్బరి నీటిలో బోలెడు పోషకాలు కొబ్బరి నీళ్లలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ప్రోటీన్, సోడియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి- 2, విటమిన్ బి 3 కూడా ఉంటాయి.

పుష్కలంగా పోషకాలు ఉన్నటువంటి కొబ్బరి నీళ్లను తాగితే మంచిది. కొబ్బరి నీళ్లు ప్రతిరోజు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. కొబ్బరి నీళ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసే తక్కువ క్యాలరీల పానీయాలలో కొబ్బరినీరు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల, అందులో సహజ ఎలక్ట్రోలైట్ లు ఉండడం కారణంగా శరీరంలోని ద్రవాల సమతుల్యతను ఇవి కాపాడతాయి. కొబ్బరినీళ్లు ఆకలిని తగ్గిస్తాయి. వీటిని తాగిన వారికి కడుపు చాలాసేపు నిండుగా అనిపిస్తుంది. కనుక వారు ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేరు. కొబ్బరి నీళ్లు జీవక్రియను పెంచడానికి బాగా దోహదం చేస్తాయి. మన శరీరంలో ఉన్న టాక్సిన్ లను బయటకు పంపడానికి కొబ్బరినీరు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు, మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు కొబ్బరి నీరు తాగితే ప్రయోజనం ఉంటుంది. కొబ్బరి నీళ్ళతో పాటు ఈ పని చేస్తేనే వెయిట్ లాస్ ఏది పడితే అది అతిగా తినేవారు కొబ్బరినీళ్లు తాగినట్లయితే వారికి ఆకలి వెయ్యదు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.