Turmeric Water: పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు ఈజీగా బరువు తగ్గాల్సిందే?

  • Written By:
  • Updated On - March 7, 2024 / 06:22 PM IST

మామూలుగా చాలామంది అధిక బరువు సమస్యను తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఎక్కువ శాతం మంది హోమ్ రెమిడీలను ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు కలగక దిగులు చెందుతూ ఉంటారు. మరి ఏం చేస్తే అధిక బరువును తగ్గించుకోవచ్చు అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. బరువు తగ్గించడంలో పసుపు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రతిరోజు పసుపు నీళ్లను తీసుకుంటే బరువు తగ్గడం మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

మన నిత్యము ఉపయోగించే పసుపు కూడా ఒకటి. వంటగదిలో ఉపయోగించే మసాలా దినుసులు ఆహారం రుచి పెంచడానికి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అటువంటి వాటిలో పసుపు చాలా ముఖ్యమైనది. పసుపు అనేక ఔషధ గుణాలతో కూడి ఉంటుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్లు, యాంటీ బయాటిక్స్ మెరుగ్గా ఉంటాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. దీనికి చేయవలసిందల్లా.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో కొవ్వు వేగంగా కరుగుతుంది.

పసుపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడం మాత్రమే కాకుండా పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలోని కొవ్వును బాగా తగ్గిస్తుంది. పసుపు నీటిని తయారు చేసుకోవడానికి రెండు కప్పుల నీటిలో ఒక స్పూన్ పసుపు వేసి మరిగించాలి. ఈ నీరు ఒక కప్పు అయ్యేవరకు మరిగించి వడపోసి అందులో తేనె మిక్స్ చేసి తాగాలి. ఇక ఇందులో నల్ల మిరియాల పొడి, ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఈ పసుపు నీటిని క్రమం తప్పకుండా రోజు తాగడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాకుండా, కీళ్ళ నొప్పులు ఉన్నవారికి కీళ్ల నొప్పులు బాగా తగ్గుతాయి. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగితే, వారికి బీపీ తగ్గుతుంది. పసుపు నీరు తాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా మీరు బరువు తగ్గుతారు. కాబట్టి క్రమం తప్పకుండా పసుపును పరకడుపున తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.