Back Pain: విపరీతమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి?

మామూలుగా కొన్నిసార్లు కదలకుండా ఒకే పొజిషన్లో ఉన్నప్పుడు వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి మరింత ఎక్కువ అయ్యి బాధ పెడుతూ ఉం

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 10:40 PM IST

మామూలుగా కొన్నిసార్లు కదలకుండా ఒకే పొజిషన్లో ఉన్నప్పుడు వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి మరింత ఎక్కువ అయ్యి బాధ పెడుతూ ఉంటుంది. దాంతో వెన్ను నొప్పితో చాలా ఉంది విలవిల్లాడిపోతూ ఉంటారు. అయితే మరి వెన్ను నొప్పి నుంచి బయట పడాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. అయితే ఈ సమస్యను మందులతో కాకుండా చిట్కాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

ఒకప్పుడు వయస్సు పైబడిన వారికే ఈ సమస్య ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ సమస్య చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధిస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవడంతో పాటు, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోయినా వెన్నుముక అదుపుతప్పి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. దాన్ని సరి చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే నొప్పి తీవ్రస్థాయికి చేరుతుంది. వెన్నెముక నొప్పికి సరిగ్గా నిద్రపోయే భంగిమ లేకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. గాఢ నిద్ర పట్టని వారికి కూడా నడుం పట్టేస్తుంది. ఇక ఈ సమస్య ఎక్కువగా ఉన్నవారు కాళ్ళ కింద దిండు పెట్టుకొని పడుకోవడం మంచిది.

అయితే వెన్నెముక నొప్పితో బాధపడే వారు కేవలం మందులను మాత్రమే కాకుండా కొన్ని శారీరక వ్యాయామాలు చేస్తే మంచిది. వెన్నెముకను బలోపేతం చేసే యోగాసనాలు చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే నొప్పి తగ్గిపోతుంది. నడుము బలంగా తయారయ్యేందుకు స్ట్రెచ్ ఎక్సర్సైజులు కూడా చేస్తే మంచిది. కనీసం వారానికి రెండు సార్లు చేసినా కండరాలు బలంగా మారుతాయి. నొప్పి తగ్గుముఖం పడుతుంది. 40 ఏళ్లు దాటిన తర్వాత క్యాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్ వీటితో కూడా వెన్నెముకకు బలం చేకూరుతుంది. ఆకుకూరలు, పాలు, పెరుగు, నిమ్మ జాతి పండ్లను తరచుగా తీసుకోవాలి. వీటితో సహజంగా విటమిన్లు శరీరానికి అందుతాయి. వెన్నెముక నొప్పి మొదలైన తర్వాత జీవనశైలిని మార్చుకోవాలి. ఎత్తు మడమ చెప్పులు వేసుకోకూడదు. దీంతో నడుముపై కొంత మేర భారం తగ్గుతుంది. ఇక ముఖ్యంగా కంప్యూటర్ మీద పని చేసే వాళ్ళు నిటారుగా ఉండాలి. అప్పుడప్పుడు లేచి కూర్చోవాలి. అలాకాకుండా నిర్లక్ష్యం చేస్తే వెన్నెముక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక లావుగా ఉన్నవారికి ఈ ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలి. ఇలా వెన్నెముక నొప్పికి చిట్కాలు పాటిస్తే తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది.