చాలామంది పంటి నొప్పి, పుచ్చిపోయిన పళ్ళు, సెన్సిటివిటీ, పిప్పి పళ్ళు లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. రోజురోజుకీ ఈ సమస్యల బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే ఈ పంటి నొప్పితో బాధపడే వారి సమస్య వర్ణనాతీతం.. పంటి నొప్పి కారణంగా చాలామంది నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అలా పంటి నొప్పి సమస్యలను తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల టూత్ పేస్టులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు ఆయుర్వేద చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఎన్ని ప్రయత్నించినా కూడా కొన్ని కొన్ని సార్లు పంటి నొప్పి సమస్య అసలు తగ్గదు.
మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే పంటి నొప్పి మిమ్మల్ని తరచూ వేధిస్తూ ఉంటే ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క చిట్కాను ఉపయోగించి పంటి నొప్పి నుంచి పిప్పి పళ్ళ సమస్య నుంచి త్వరగా రిలీఫ్ పొందవచ్చు. జామ చెట్టు ఆకుతో పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. ముందుగా దీనికోసం 5 లేదా 6 జామ ఆకులను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత ఈ ఆకులలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వాటిని ఒక గ్లాసు నీరు వచ్చేవరకు గ్యాస్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి. తర్వాత మరిగిన మిశ్రమాన్ని వడగట్టి చల్లారే వరకు ఉంచాలి. తర్వాత దానిలో రాళ్ల ఉప్పును వేసి ఉప్పు బాగా కరిగేవరకు మరిగించుకోవాలి.
అలా తయారు చేసుకున్న నీటిని నోట్లో వేసుకొని బాగా పుక్కిలించాలి. ఇలా ప్రతిరోజు ఈ నీటిని పుక్కిలించడం వలన పంటి నొప్పి, పిప్పిపళ్ళ సమస్య నుంచి బయటపడవచ్చు. జామ ఆకులతో తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు మూడు లేదా నాలుగు సార్లు పుక్కిలించాలి. ఇలా చేస్తే చాలి ఎటువంటి మందులు, టూత్ పేస్టులు అవసరం ఉండదు. ప్రతిరోజు ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన దంత సమస్యలు కూడా తగ్గుతాయి. హాస్పిటల్స్ కి వెళ్లి వేలకు వేలు డబ్బులు వృధా చేసే బదులు ప్రకృతిలో దొరికే ఆకులతో ఈ చిట్కాలు చేసుకొని పంటి సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వలన దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. జామ ఆకులు నోటి సమస్యలను తగ్గిస్తాయి.