Site icon HashtagU Telugu

Ayurveda Tips: మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయాల్సిందే?

Mixcollage 31 Jan 2024 08 49 Pm 3313

Mixcollage 31 Jan 2024 08 49 Pm 3313

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మలబద్ధకం సమస్య ఒకటి. ఈ మలబద్ధకం సమస్య వచ్చినప్పుడు చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మలబద్ధకంగా ఉంటే ఆకలి వేసినా, ఏమీ తినాలని, తాగాలని అనిపించదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా పొట్ట సమస్యే అని చెప్పవచ్చు. కాబట్టి వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్, నీటి శాతం తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణం కాక మలబద్ధకం సమస్యను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆహారంలో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలి.

ఈ సమస్యతో బాధపడుతున్న వారు చాలామంది అనేక రకాల ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా. అయితే ఇక మీదట ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేసి చూడండి. దెబ్బకు మలబద్ధకం సమస్య పరార్ అవ్వాల్సిందే. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయాన్ని వస్తే.. మలబద్దకం బారిన పడకుండా గుల్కండ్ చాలా బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని పాలలో గులాబీ రేకులతో చేసిన గుల్కండ్, తేనె మంచి మెడిసిన్. అంతేకాదు పంచదార, మెంతుల పొడి, యాలకుల పొడి కలుపుకుని తిన్నా మంచి రిజల్ట్ వస్తుంది. విత్తనాలను తీసివేసి గులాబీ రేకులతో తయారు చేసిన గుల్కండ్ అందమైన రంగుతో పాటు మంచి రుచిని కలిగి ఉంటుంది.

మలబద్ధకం నివారణకు ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తినే ఆహారంలో చేర్చుకోండి. మలబద్ధకం కోసం ఉత్తమమైనవి మెంతులు. మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుండి విముక్తి పొందడం కోసం క్రమం తప్పకుండా మెంతులను తీసుకోవాలీ. ఒక గాజు గ్లాస్ లో నీరు తీసుకుని ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టి ఆ మెంతులను మర్నాడు ఉదయం తినాలి. లేదా నిద్ర పోయే మందు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతిపొడి వేసుకుని తాగాలి. దీంతో ఫ్రీగా మోషన్ అవుతుంది. మలబద్ధకం ప్రధాన కారణాల్లో ఒకటి జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం. సొంటి, మిరియాలు, జీలకర్ర, నల్ల జీలకర్ర, పింక్ సాల్ట్, ఇంగువ, మిరియాల పొడి మిశ్రమాన్ని తీసుకుని ఒక స్పూన్ నీరు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని ఆహారం తినడానికి ముందు తీసుకోవాలి. మలబద్ధకం లక్షణాలలో ఒకటి ప్రేగు కదలికలు సరిగ్గా లేకపోవడంతో పాటు ప్రేగు కదలికల సమయంలో నొప్పి, అపానవాయువు, కడుపు నొప్పి, వికారం. కనుక మలబద్ధకం నివారణ కోసం పరిశుభ్రమైన నీరుని తాగాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినకూడదు. ఫైబర్ తక్కువగా ఉండే ఫుడ్స్ ఎక్కువ తినడం మంచిది.