Site icon HashtagU Telugu

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు ఉదయాన్నే పొరపాటున కూడా తినకూడని ఆహార పదార్థాలు ఇవే?

Diabetes

Diabetes

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే డయాబెటిస్ పేషెంట్లు భయపడే అతిపెద్ద విషయం ఆహార పదార్థాలు. ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. వాటి కారణంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి లేనిపోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే పొరపాటున కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదని చెబుతున్నారు.

మరి డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..షుగర్ ఉన్నవారు ఆహార అలవాట్లను, జీవన శైలిని తప్పనిసరిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది పడితే అది తినటం, ఎప్పుడు పడితే అప్పుడు తినటం చెయ్యకూడదు. క్రమబద్ధమైన జీవన సరళితో షుగర్ ను ఎప్పటికప్పుడు కంట్రోల్ లో ఉంచుకోవాలి. ఇక షుగర్ పేషెంట్స్ ఉదయాన్నే అల్పాహారంగా కొన్ని పదార్ధాలను అస్సలు తీసుకోకూడదు. చాలా మంది ఉదయాన్నే ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యం అని తాగుతూ ఉంటారు. కానీ షుగర్ పేషెంట్స్ ఫ్రూట్ జ్యూస్ ల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఫ్రూట్ జ్యూస్ లు తాగటం వలన షుగర్ పేషెంట్ లలో చెక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. కాబట్టి ఫ్రూట్ జ్యూస్ లు తాగటం ఉదయం పూట అస్సలు మంచిది కాదు.

ముఖ్యంగా పండ్ల రసాల కంటే బత్తాయి, బొప్పాయి వంటి పండ్లను తినటం మంచిది. షుగర్ పేషెంట్స్ చాలా మంది ఉదయాన్నే పాన్ కేకులు తినకూడదు. అవి రుచిగా మనకు సంతృప్తిని కలిగించేవిగా ఉన్నప్పటికీ వాటి వల్ల రక్తంలో చెక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి పాన్ కేకులకు షుగర్ పేషెంట్స్ దూరంగా ఉండటమే మంచిది. అంతేకాదు చాలా మంది ఉదయాన్నే స్మూతీలు చేసుకుని తాగుతూ ఉంటారు. షుగర్ పేషెంట్స్ కు స్మూతీలు మంచివి కాదు. ఇందులో పాలు, పెరుగు వివిధ రకాల పండ్లు, చెక్కెర ఉంటాయి. కాబట్టి స్మూతీలు తాగటం డయాబెటిస్ పేషెంట్స్ ను డేంజర్ లోకి నెడుతుంది. కాబట్టి డయాబెటిస్ బాధితులు స్మూతీలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే డయాబెటిస్ బాధితులు క్యాండీలను అస్సలే తినకూడదు. ఉదయాన్నే వీటిని తినటం మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకోవటం అవుతుంది. అల్పాహారంగా తీసుకునే క్యాండీ లలో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. ఇవి చెక్కెరతో నిండి ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ క్యాండీలకు దూరంగా ఉండమని వైద్యులు చెబుతున్నారు.

note : పైన ఆరోగ్య సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యులు సలహా తీసుకోవడం మంచిది..