Site icon HashtagU Telugu

Health Tips: ఉదయం నిద్ర లేవగానే తలనొప్పిగా ఉంటోందా.. వెంటనే ఇలా చేయండి!

Health Tips

Health Tips

ఉదయం నిద్ర లేవగానే ఎనర్జీగా ఎంతో ఫ్రెష్ గా మైండ్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి ఉదయం నిద్ర లేచినప్పుడు తలనొప్పిగా తల భారంగా అనిపిస్తూ ఉంటుంది. మానసిక స్థితి బాగా లేకపోతే రోజంతా పనిచేయడం చాలా కష్టం. అలాగే చిరాగ్గా కూడా అనిపిస్తుంది. చలికాలంలో చాలా మందికి ఉదయాన్నే తలనొప్పి వస్తుంది. సాధారణంగా చలికాలంలో ఉదయం తలనొప్పి రావడం సర్వసాధారణం. తక్కువ ఉష్ణోగ్రతలు, చల్లని గాలుల వల్ల ఇలా జరగవచ్చు. అలాగే సరిగా నిద్ర పట్టకపోయినప్పుడు కూడా తలనొప్పి రావడం లాంటివి జరుగుతుంటాయి. ఈ తలనొప్పి కొన్ని గంటల పాటు ఉంటుంది.

అందుకే ఈ సమస్యను వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. మరి ఉదయాన్నే తలనొప్పిని తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా తలనొప్పి రావడానికి శరీరంలో నీరు లేకపోవడమే ప్రధాన కారణం. శీతాకాలంలో చాలా మంది నీళ్లను తక్కువగా తాగుతుంటారు. ఎందుకంటే ఈ సీజన్ లో చెమట తక్కువగా పడుతుంది. దీంతో మీకు ఎక్కువ దాహంగా అనిపించదు. కానీ నీళ్లను తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురై తలనొప్పి వస్తుంది. అందుకే మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలనీ చెబుతున్నారు. రోజులో కనీసం 8 గ్లాసుల నీటిని అయినా తప్పకుండా తాగాలని చెబుతున్నారు. అలాగే చాలామంది ఒత్తిడికి లోనవుతూ ఉంటారు.

ఇలా అధిక ఒత్తిడి కారణంగా కూడా తల నొప్పి వస్తూ ఉంటుంది. ఇది నిరాశ, ఆందోళన వంటి సమస్యలను నివారించడానికి కూడా మీకు సహాయపడుతుంది. చలికాలంలో జలుబుతో పాటుగా సైనస్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అయితే జలుబు కారణంగా ముక్కు మూసుకుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు తలనొప్పి కూడా వస్తుంది. అందుకే మీ గదిలో హ్యూమిడిఫైయర్ ఉపయోగించాలని చెబుతున్నారు. ఇది గాలిలో తేమను నిలుపుకుంటుందట. అలాగే మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. చల్లని గాలులు చెవుల్లోకి వెళ్లకుండా రాత్రిపూట మందపాటి దుప్పట్లను ఉపయోగించాలట. అంతేకాదు కావాలంటే టోపీ పెట్టుకుని కూడా నిద్రపోవచ్చు. ఇలా చేయడం వల్ల చలి ఎక్కువగా పెట్టదు. అలాగే ఉదయం లేచిన తర్వాత తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.