Site icon HashtagU Telugu

Health Tips : కోడిగుడ్డు, ఆ ఆహారం పదార్థాలు కలిపి తింటున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Mixcollage 16 Jan 2024 06 37 Pm 9928

Mixcollage 16 Jan 2024 06 37 Pm 9928

కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కోడిగుడ్డులో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కోడిగుడ్డులో ఎన్నో పోషకాలు ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. అయితే కోడి గుడ్డును తినడం మంచిది కానీ, కోడిగుడ్డు తినేటప్పుడు పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా కోడిగుడ్డుతో కలిపి కొన్ని రకాల ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కోడిగుడ్డు మన శరీరానికి కావలసిన, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, విటమిన్స్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా గుడ్లలో శరీరానికి కావాల్సిన శాచురేటెడ్ ఫ్యాట్స్‌, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కొంతమంది కోడి గుడ్డుతో పాటు కలిపి వేరే ఆహారపదార్థాలు తినే అలవాటు ఉంటుంది. వాటిల్లో కొన్ని కలిపి తీసుకోవడం వల్ల మనం అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. గుడ్లతో, టీని కలిపి తాగడం వల్ల గుడ్లలోని ప్రోటీన్ కంటెంట్ 17 శాతం వరకు తగ్గుతుంది. టీలో పాలీఫెనాల్స్ అని పిలువబడే సమ్మేళనాలు ఉంటాయి.

ఇది గుడ్లలోని ప్రోటీన్‌లకు కట్టుబడి, ప్రోటీన్లు మన శరీరానికి అందకుండా నిరోధిస్తుంది. దీని కారణంగా ప్రోటీన్ కు సంబంధించిన అనేక, తలెత్తుతాయట. టీ, కోడిగుడ్డును కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. గుడ్డులోని ప్రోటీన్ల మన శరీరానికి అందకపోవడం వల్ల చర్మం, జుట్టు, గోర్లు వాటి రంగు మారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ప్రోటీన్ లోపం కారణంగా ఎముకల బలహీనత, కండరాల బలహీనత వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీని కారణంగా రోగనిరోధక వ్యవస్థ కూడా తగ్గిపోయి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. టీ తో పాటు గుడ్లను తినటం వల్ల శరీరంలో ఫ్యాటి లివర్ వంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలి అంటే టీ తో పాటు ఉడకబెట్టిన గుడ్డు, లేదా గుడ్లను తీసుకోకపోవడం చాలా మంచిది.