Throat Pain: గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి?

  • Written By:
  • Publish Date - March 30, 2024 / 05:45 PM IST

మాములుగా మనకు జలుబు, దగ్గు వంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా గొంతులో మంట, గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్ని సార్లు గొంతు నొప్పి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారాన్ని కూడా మింగలేని పరిస్థితి వస్తుంది. అయితే గొంతు నొప్పి తగ్గాలంటే మనం కొన్ని వంటింటి చిట్కాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మందులు వాడినా కూడా ఫలితం లభించకపోతే కొన్ని రకాల చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే. మరి అందుకోసం ఏమి చేయాలి అన్న విషయానికి వస్తే.. వేడి నీళ్లలో తేనె కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

తేనెలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు మంటను, నొప్పిని దూరం చేసి కాస్త రిలీఫ్ నిస్తుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే అల్లం టీ తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. అల్లం టీ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పి నుంచి మంచి రిలీఫ్ ఇస్తాయి. గొంతు వాపును, నొప్పిని అల్లం టీ తగ్గిస్తుంది. అల్లం టీతో జీర్ణ సమస్యలు కూడా బాగా తగ్గుతాయి. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే మూలికలతో తయారు చేసిన హెర్బల్ టీ, చామంతి టీ తాగితే మంచిది. వీటిలో ఉన్న ఔషధ గుణాలు గొంతు నొప్పిని, మంటను బాగా తగ్గిస్తాయి. వద్దు నొప్పితో బాధపడుతున్న వారు గోరువెచ్చని ఉప్పునీటిని పుక్కిలించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అలాగే గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వేడి నీళ్లను తాగడం మంచిది. వేడివేడి సూప్స్ తాగితే కూడా గొంతునొప్పి నుండి రిలీఫ్ వస్తుంది. సూప్ తాగడంతో గొంతుకు రిలీఫ్ దొరికి నొప్పి కాస్త తగ్గుతుంది. చికెన్ లేదా వెజిటేరియన్ సూప్ లు తాగితే గొంతు మంట, నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. పసుపు పాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపును కంట్రోల్ చేస్తాయి. గొంతు నొప్పితో బాధపడుతున్న వారు పుదీనా ఆకులను కలిపిన నీటిని తాగితే కూడా ప్రయోజనం ఉంటుంది. గొంతు నొప్పి తగ్గుతుంది. ధనియాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పిని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.