Site icon HashtagU Telugu

Health Tips: రాత్రిళ్ళు నోరు తెరిచి నిద్రపోవడం మంచిది కాదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Health Tips

Health Tips

మామూలుగా నిద్రపోయేటప్పుడు కొంతమంది కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. అయితే అవి అనుకోకుండా జరిగినప్పటికీ అవి అనేక సమస్యలను తెచ్చిపెడతాయని చెబుతున్నారు. అటువంటి వాటిలో పడుకునేటప్పుడు నోరు తెరిచి నిద్రపోవడం కూడా ఒకటి. అయితే మామూలుగా పడుకునేటప్పుడు నోరు మూసుకొని పడుకున్నప్పటికీ గాడ్ నిద్రలో ఉన్నప్పుడు తెలియకుండానే కొంతమందికి నోరు తెరుచుకోవడం, నోరు తెరిచి నిద్రపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. నోరు తెరిచి నిద్రపోతున్న సమయంలో ముక్కుతో బదులుగా నోటితో శ్వాస తీసుకుంటూ ఉంటారు. తీసుకున్నప్పుడే గురక శబ్దం వస్తూ ఉంటుంది.

అలాగే నోటి నుంచి లాలాజలం కూడా బయటికి వస్తూ ఉంటుంది. దీన్నే జొల్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. కాగా నోరు తెరిచి నిద్రపోయే అలవాటు చాలా చిన్నగా అనిపించినా ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. అవును నోరు తెరిచి నిద్రపోయే వారు చాలా జాగ్రత్తగా ఉండాలనీ చెబుతున్నారు. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందట. మరి నోరు తెరిచి నిద్రపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నోరు తెరిచి నిద్రపోవడం వల్ల మీ దంతాల ఆరోగ్యం ప్రభావితం అవుతుందట. ఎలా అంటే నోరు తెరిచి నిద్రపోవడం వల్ల నోట్లోకి గాలి వెళ్లి నోట్లోని లాలాజలం ఆరిపోయేలా చేస్తుందట.

ఇది లాలాజలం, ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తుందట. అలాగే ఇది నోట్లో ఎన్నో రకాల బ్యాక్టీరియాను పెంచుతుందని చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా కారణంగా దంతాలు దెబ్బతింటాయట. లాలాజలం లేకపోవడం వల్ల పంటి ఇన్ఫెక్షన్లు, చెడు వాసన, కావిటీస్ వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే నోరు తెరిచి నిద్రపోయే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వీరు ముక్కుకు బదులుగా మీ నోటి నుంచి శ్వాసను తింటుకుంటే మీ శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదట. ఇది ధమనులలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందట.

మీ గుండె ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా నోరు తెరిచి పడుకునే అలవాటు ఆస్తమా పేషెంట్లను చేస్తుందట. ఈ అలవాటు ఉండటం వల్ల ఊపిరితిత్తులు మరింత శక్తితో పని చేయాల్సి వస్తుందట. దీని కారణంగా ఉబ్బసం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా నోరు తెరిచి నిద్రపోవడం వల్ల కూడా పెదవులు పొడిబారి, పగుళ్లు ఏర్పడతాయట. నోటి ద్రవాలు ఎండిపోవడం వల్ల ఆహారం మింగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. నోరు తెరిచి నిద్రపోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య కూడా ఇబ్బంది పడుతుందట.