శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో అలాగే కంటికి కూడా నిద్ర అంతే అవసరం. రాత్రి సమయంలో కొంతమందికి పడుకోగానే వెంటనే నిద్ర వస్తే మరి కొందరికి మాత్రం అర్ధరాత్రి అయినా కూడా నిద్ర రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో నిద్ర రాకపోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల కారణంగా కూడా రాత్ర సమయలో నిద్ర పట్టదు. అలాగే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోయినా కూడా రాత్రి నిద్ర పట్టదు. రాత్రి సమయంలో పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగితే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అంతేకాకుండా నిద్ర కూడా బాగా పడుతుంది. మరి రాత్రి సమయంలో పాలు తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. శరీరంలో సెరోటోనిన్ మొత్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో కూడా బాగా సహాయపడుతుంది. అయితే రాత్రి సమయంలో కొంతమంది నిద్ర రావడం లేదు అని టీవీ,మొబైల్ ఫోన్ ను చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే ప్రతి సమయంలో కూడా తింటూ ఉంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మరింత హానికరం.
అలా రాత్రిపూట నిద్ర పట్టనప్పుడు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల కంటి నిండా నిద్ర వస్తుంది. పాలలో ఉండే ప్రోటీన్లు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంతోపాటు కంటి నిండా నిద్రపోయేలా చేస్తాయి. అలాగే పాలలో ఉండే భేదిమందు లక్షణాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. దీంతో పాటు ఉదయం ప్రేగు కదలిక ప్రక్రియ కూడా సులభం అవుతుంది. రాత్రిపూట దీన్ని తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. రాత్రిపూట పాలు తాగడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడే వీనస్ మూలకాన్ని బలపరిచి గర్భాశయానికి సరైన పోషణను అందించి సంతానోత్పత్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది.