Health Tips: టీ ని మళ్లీమళ్లీ వేడి చేసుకుని తాగుతున్నారా.. అయితే జాగ్రత్త!

చాలామందికి ప్రతిరోజు టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కొందరు టీలకు బాగా ఎడిక్ట్ అయిపోయి విపరీతంగా లెక్కలేనన్ని సార్లు టీ తాగుతూ ఉంటారు. దీని వల

  • Written By:
  • Publish Date - July 3, 2024 / 07:26 AM IST

చాలామందికి ప్రతిరోజు టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కొందరు టీలకు బాగా ఎడిక్ట్ అయిపోయి విపరీతంగా లెక్కలేనన్ని సార్లు టీ తాగుతూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా కూడా అలాగే తాగుతూ ఉంటారు. ఇంకొందరు అయితే టీ ఒకవేళ చల్లగా అయితే మళ్లీ మళ్లీ వేడి చేసుకొని తాగుతూ ఉంటారు. అయితే ఇలా తాగడం ఆరోగ్యానికి ప్రమాదం తెలిసిన కూడా చాలామంది లెక్కచేయకుండా అలాగే తాగుతూ ఉంటారు. టీ తాగే అలవాటు ఉన్నవారు రోజుటీ కు రెండు కప్పుల కంటే ఎక్కువ టీ తాగటం మంచిది కాదు.

చాలా మంది టీ ప్రియులు రుచి పేరుతో ఎక్కువ సేపు మరిగించే టీ ను తాగుతూ ఉంటారు. కానీ అది వారి ఆరోగ్యాన్ని చాలా దారుణంగా మారుస్తుంది. బాగా ఎక్కువగా మరిగించిన టిని తాగడం వల్ల అనేక అనర్ధాలు కలుగుతాయి, కొత్త కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయి. విపరీతంగా మరిగించిన టీ ను తాగడం వల్ల అజీర్ణం సమస్య వస్తుంది. ఎసిడిటీ ఏర్పడుతుంది. కడుపుకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు రావడానికి ఇది కారణం అవుతుంది. జీర్ణ సమస్యలతో ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇక అధిక రక్తపోటు ఉన్నవారు పదేపదే మరిగించిన టీని లేదా పదేపదే వేడి చేసిన టీ తాగడం వలన శరీరంలో టానిన్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది.

అలాగే రక్తహీనత, నిద్రలేమి కి ఇదొక కారణం దీనివల్ల రక్తపోటు మరింత ఎక్కువ అవుతుంది. పదే పదే మరిగించిన టీ ని తాగడం వల్ల శరీరంలో టానిన్ మొత్తం పెరిగితే ఐరన్ స్థాయిలు ప్రభావితం అవుతాయి. ఫలితంగా రక్తహీనత ఏర్పడుతుంది. విపరీతంగా మరిగించిన టీ ని పదేపదే తాగడం వల్ల టీ లో కెఫిన్ కంటెంట్ బాగా పెరుగుతుంది. ఇది నిద్రలేమికి కూడా కారణం అవుతుంది. టీ పదేపదే మరిగించి తాగటం మంచిది కాదు. విపరీతంగా మరిగించిన టీ ని ఎక్కువగా తాగడం ఆకలిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి టీ తాగాలని భావించేవారు రోజుకు రెండుసార్లు మాత్రమే, అది కూడా ఎప్పటిది అప్పుడు పెట్టుకొని తాగడం మంచిది. ఒకేసారి టీ పెట్టుకుని దానిని పదే పదే వేడి చేసుకుని తాగడం అస్సలు మంచిది కాదు.