శీతాకాలం వచ్చింది అంటే చాలు ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చాలామంది చలికాలంలో ఉదయం లేవాలి అంటేనే బద్ధకిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చలికాలంలో నిద్ర లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఉదయాన్నే లేచి కాస్త వ్యాయామం చేయాలి. అంతేకాకుండా సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల తల్లితో పాటు బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చలికాలంలో నీరు తాగాలని అనిపించదు అయినా కూడా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు 2.5 నుంచి 3. కడుపులో ఉమ్ము నీరు ఏర్పడడం కోసం నీరు అవసరం. అలాగే శరీరంలో రక్తం స్థాయి పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు శీతాకాలంలో టీ కాఫీ వంటివి ఎక్కువగా తాగకూడదు. టీ కి బదులుగా ఏదైనా సూప్ లేదా కొబ్బరినీళ్లు జ్యూసులు తాగడం మంచిది. చలికాలంలో జబ్బులు రాకుండా ఉండాలి అంటే ఫ్లూ షాట్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే సబ్బుతో నీటిని తరచుగా కడుక్కుంటూ ఉండాలి. అనారోగ్యం ఉన్న వ్యక్తులకు గర్భిణి స్త్రీలు దూరంగా ఉండటం మంచిది.
అలాగే చలికాలంలో గర్భిణీ స్త్రీలు చురుకుగా ఉండడం కోసం క్రమం తప్పకుండా సున్నితమైన యోగాలు చేయాలి. గర్భవతిగా ఉన్నప్పుడు చేసే సున్నితమైన యోగాల వల్ల వెన్నునొప్పి అలసగా వంటివి తగ్గి శరీర నొప్పులను తగ్గిస్తుంది. అలాగే రాత్రి సమయంలో తొందరగా పడుకుని తగినంతసేపు నిద్రపోవాలి. ఉదయాన్నే సూర్య కిరణాలకు కాసేపు కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది. మార్నింగ్ సిక్‌నెస్, ఆహార మార్పులు, చర్మ సంరక్షణ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో చర్మ సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పరిస్థితుల్లో మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను వాడాలి.