Site icon HashtagU Telugu

Health Tips: మాంసాహారం ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త.. ఆ సమస్యలు రావడం ఖాయం?

Redmeat 849360782 770x553

Redmeat 849360782 770x553

రోజురోజుకీ మాంసాహార ప్రియుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. వారంలో కనీసం నాలుగైదు సార్లు అయినా సరే మాంసాహారం తినాల్సిందే. సమయం సందర్భం లేకుండా ఇంట్లో అయినా లేదంటే బయట అయినా సరే మాంసాహారం తింటూ ఉంటారు. అయితే మాంసాహారం తినడం మంచిదే కానీ అతిగా మాంసాహారం తీసుకుంటే మాత్రం ప్రమాదాలు తప్పవు అంటున్నారు వైద్యులు. మరి మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా మాంసాహారం ఎముకల ఆరోగ్యాన్ని ఉపయోగపడుతుంది.

ఎముకల పనితీరు సక్రమంగా ఉండాలంటే రెడ్ మీట్ తీసుకోవాలి. అలాగే మటన్ అధికంగా తింటే బోన్స్ పై సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తుంది.. ఎందుకంటే ఇందులో చెడు కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మన రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచడంతో పాటు గుండె నాళాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా గుండె జబ్బులను బారిన పడే అవకాశం ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే జంతువుల నుండి వచ్చే హై ప్రోటీన్ కారణంగా ఎముకలు కాల్షియంను కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే మాంసాహారం తీసుకునే సాయి అధికమైతే ఎముకలు ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది.

అలాగే రెడ్ మీట్లో పాస్పరస్, క్యాల్షియం నిష్పత్తి అధికంగా ఉంటుంది. ఇది ఎముకల్లోని కాల్షియం కోల్పోయే స్థితిని అధికమయ్యేలా చేస్తుంది. దీని ఫలితంగా మినరల్ రహితంగా ఎముక మారిపోతూ ఉంటుంది. రెడ్ మీట్ అధికంగా తినే వారిరక్తంలో ఆమ్లత్వం అధికమవుతుంది. దీని వలన కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించలేదు. అలాగే ఎసిడిక్ బ్లడ్ కారణంగా ఎముకలపై ద్రవ ప్రభావం పడి అవి బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. రక్తంలో ఆమ్లత్వం పెరిగితే ఇది ఎముకల నుండి కాల్షియం తొలగిపోవడానికి దోహదపడుతుంది. మాంసాహారానికి బదులుగా కొన్ని రూపాల్లో ప్రోటీన్ ని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పాల లాంటి డైరీ పదార్థాలు చికెన్ ,ప్రోటీన్ చేపలు డైట్ లో చేర్చుకోవాలి.

Exit mobile version