Site icon HashtagU Telugu

Banana: ఆ ఆరోగ్య సమస్యలున్నవారు అరటి పండు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 19 Mar 2024 06 44 Pm 9456

Mixcollage 19 Mar 2024 06 44 Pm 9456

అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండుని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. కాగా మనకు ఈ అరటిపండ్లు మనకు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. అయితే అరటిపండు ఆరోగ్యానికి మంచిదే కానీ , కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తీసుకోవడం అసలు మంచిది. మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు అరటిపండు తినకూడదు? ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అరటిపండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి అరటి పండ్లను డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. అంతేకాదు జీర్ణ సంబంధమైన వ్యాధులతో బాధపడే వారు కూడా అరటి పండ్లను తినకూడదు. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు వారికి రక్తంలో చక్కెర మరింత పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటి పండ్లను తినకుండా ఉంటేనే మంచిది. అలాగే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు అరటి పండ్లను తినకూడదు. అంతేకాదు విపరీతమైన జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు కూడా అరటి పండ్లను తినకూడదు.

అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు కూడా అరటి పండ్లకు దూరంగా ఉండాలి. మైగ్రేన్ తో బాధపడే వారు అరటి పండ్లను తినకుండా ఉంటేనే మంచిది. మైగ్రేన్ తో బాధపడేవారు అరటిపండ్లను తినకుండా ఉండాలి. ఇది మైగ్రేన్ సమస్యను మరింత పెంచుతుంది. ఇక అజీర్ణ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లను చాలా తక్కువగా తినాలి. ఎక్కువ అరటి పండ్లు తింటే జీర్ణ సమస్యలు మరింత పెరుగుతాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా అరటిపండును తినకుండా ఉండాలి. ఇక లూజ్ మోషన్స్ అవుతున్న వారు విరోచనాలను తగ్గించడానికి అరటి పండ్లను తింటారు కానీ, ఎక్కువ అరటి పండ్లు వీరు కూడా తినడం మంచిది కాదు.