Health Tips: ఆ మూడు వ్యాధులు ఉన్నవారు పొరపాటున కూడా వేరుశనగలు తినకూడదట?

ఏదైనా కూడా మితిమీరితే సమస్యలు తప్పవు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అది ఆహార పదార్థాలు అయినా మరి ఏదైనా కానీ మితంగా ఉండాలి. మనం తీసుకునే ఆహార

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 05:45 PM IST

ఏదైనా కూడా మితిమీరితే సమస్యలు తప్పవు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అది ఆహార పదార్థాలు అయినా మరి ఏదైనా కానీ మితంగా ఉండాలి. మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏవైనా కూడా ఆరోగ్యానికి మంచి చేసేవి అయినా కూడా మితిమీరి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు.. అటువంటి వాటిలో వేరుశనగలు కూడా ఒకటి. వేరుశనగలను అతిగా తీసుకోకూడదు. వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా మూడు రకాల వ్యాధులు ఉన్నవారు కూడా వేరుశెనగని అసలు తీసుకోకూడదట. వేరుశనగపప్పులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. పచ్చివి లేదా వేయించినవి అలాగే ఉప్పు పట్టించినవి కూడా తినవచ్చు.

రోజుకు గుప్పెడు పల్లెలు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పల్లిలలో మోరోసాచిడ్ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండె జబ్బులని 20 శాతం వరకు తగ్గించుకోవచ్చు. ఎలర్జీ సమస్యతో బాధపడే వారు ఈ వేరుశనగలను తీసుకోకపోవడమే మంచిది. ఎలర్జీలు, జలుబు దగ్గు వంటివి వస్తున్న వాళ్ళు వేరుశనగకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొవ్వు గుండెకు చాలా మంచిది. శరీరానికి మేలు చేసే ఆంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ. విటమిన్, నియాసిన్ ప్రోటీన్ మాంగనీస్ వేరుశనగలలో అధికం అలాగే అమీనా యాసిడ్స్ కూడా ఎక్కువే. ఈ వేరుశనగపప్పుని నిత్యం మనం ఆహార రూపంలో తీసుకోవడం వలన పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వేరుశనగ గింజల్ని ఏ రూపంలోనూ తీసుకోకూడదు.

కాలేయ సమస్యలతో బాధపడే వాళ్ళు అస్సలు ఈ వేరుశనగ గింజల్ని తీసుకోకూడదు. కాలేయ సమస్యలు వచ్చి తగ్గిన వారు కూడా తీసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇందులో ఉన్న యాసిడ్స్ ఆ రసాయనాలు కాలేయ పనితీరును దెబ్బతిస్తాయి. ఉత్పత్తి చేస్తుంది అది మనం మెదడును సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అలాగే అధిక బరువు సమస్య ఉన్నవారు కూడా ఈ వేరుశనగలను తీసుకోవడం వల్ల టార్గెట్ ని రీచ్ కాలేదు. ఎందుకంటే ఇందులో కొవ్వు శాతం ఎక్కువ కనుక అధిక బరువుతో ఊబకాయంతో అలాగే ఆయాసంతో బాధపడుతున్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ వేరుశనగపప్పును తీసుకోకపోవడం మంచిది.

అధిక బరువుతో బాధపడేవారు ఈ వేరుశనగ గింజలు తీసుకోకూడదట. ఎందుకంటే అధిక బరువుతో బాధపడుతున్న వారిలో చెడు కొవ్వు ఎక్కువగా ఉంటుంది. మంచి కొవ్వు తక్కువ ఉంటుంది. వారు చేసినటువంటి వ్యాయామాలకు కొంచెం ఫలితం తగ్గుతుంది. ఇందులో ఉండే నూనె శాతం కొవ్వగా మారుతున్నప్పుడు ఆ మంచి కొవ్వు సైతం చెడు కొవ్వుగా మారే అవకాశం ఉంది. అందుకని అధిక బరువుతో ఉన్నవాళ్లు వీటిని కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. విటమిన్స్ మన మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.