Site icon HashtagU Telugu

Health Tips: ఆ సమస్యలు ఉన్నవారు గుడ్డు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 19 Dec 2023 03 53 Pm 2361

Mixcollage 19 Dec 2023 03 53 Pm 2361

కోడిగుడ్డు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కోడిగుడ్డుని తరచూ మన డైట్ లో చేర్చుకోమని డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. గుడ్డును తినడం వల్ల శరీరానికి కావలసిన ఎన్నో రకాల ప్రోటీన్లు పోషకాలు అందుతాయి. గుడ్డు ఎన్నో రకాల సమస్యలను దూరం చేయడంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. అయితే గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు కోడి గుడ్డు తినడం అసలు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మరి ఎటువంటి సమస్య ఉన్నవాళ్లు కూడా గుడ్డు తినకూడదో, తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడ్డులో క్యాల్షియం, పోలిక్ యాసిడ్ ,ఫాస్ఫరస్ ,ప్రోటీన్ వంటివి లభిస్తాయి. ఇవి శరీరానికి ఎంతో మంచిది. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా గుడ్లను ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. అయితే సమస్యతో బాధపడేవారు గుడ్లని తీసుకోవద్దు. ఎందుకంటే కొలెస్ట్రాల సమస్య మరింత అధికమవుతుంది. అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా అస్సలు గుడ్లను తీసుకోకూడదు. అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు గుడ్లని అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే గుడ్లు తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు మరింత అధికంగా అవుతూ ఉంటాయి.

అలాగే ఈ మధుమేహ వ్యాదిగ్రస్తులు అస్సలు గుడ్లను తీసుకోకూడదు. ఒకవేళ తినాలి అనుకుంటే వైద్య నిపుణుని సలహా తీసుకున్న తర్వాతే తీసుకోవాలి. ఎందుకనగా గుడ్లు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి గుడ్లును తీసుకోకుండా ఉండడమే మంచిది.అదేవిధంగా అధిక బరువు ఉన్నవారు పొరపాటున కూడా గుడ్లను తినవద్దు. ఎందుకనగా త్వరగా బరువు పెరగడానికి ఈ గుడ్లు లలో ఫ్యాట్ అధికంగా కాబట్టి బరువు పెరగడానికి బాగా సహాయపడతాయి. అందుకే గుడ్లు అధిక బరువును పెంచుతాయి. కాబట్టి వీటిని అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవాళ్లు అసలు తీసుకోవద్దు.