Site icon HashtagU Telugu

Health Tips: మారేడు పత్రాల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

Mixcollage 17 Dec 2023 08 31 Pm 7017

Mixcollage 17 Dec 2023 08 31 Pm 7017

మన చుట్టూ ఎన్నో రకాల మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొందరు వాటిని పిచ్చి మొక్కలు అని వాటిని పీకి పారేస్తూ ఉంటారు. ఇంకొన్ని రకాల చెట్లను ఇంటి దగ్గర పెంచుకున్నప్పటికీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియవు. అయితే మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పెంచుకునే చెట్లలో మారేడు చెట్టు కూడా ఒకటి. ఈ మారేడు చెట్టును చాలామంది ఈ పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మారేడు పత్రాలు వినాయకుడికి అలాగే శివలింగానికి సమర్పిస్తూ ఉంటారు. ఈ పండు రుచి తీపి, పులుపు కలిగి ఉంటుంది. అదేవిధంగా మూడు ఆకులు ఉన్న మారేడు పత్రం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని రూపంలో కొలుస్తూ ఉంటారు.

ఈ పండ్లు బెరడు, వేర్లు, ఆకులు, పువ్వులు కాయలు ఇవన్నీ కూడా గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. ఈ బిల్వ చెట్టులో ప్రతిభాగం మనుషులకు మంచి చేసే ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్నది. అతిసారం అనే వ్యాధికి మారేడు పండ్లతో చేసిన రసం చాలా బాగా సహాయపడుతుంది. మారేడు ఆకులు కొద్దిపాటు జర్వన్ని కూడా నయం చేస్తాయి. ఈ బిల్వాకులు కషాయము తీసి అవసరం మేరకు కొంచెం తేనెను కలుపుకొని ఈ కషాయం తాగినట్లయితే జ్వరం తొందరగా నయం అవుతుంది. దీని ఆకుల రసం చక్కెర వ్యాధి నివారణకు చాలా మేలు చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ బిల్వపత్రాలకు కడుపులోని పేగులను అల్సర్లను తగ్గించే గుణం కలిగి ఉంది..

మలేరియా జ్వరం తగ్గించే గుణము విలువ ఆకులకు ఫలాలకు ఉంది. ఈ మారేడు పండు నుంచి తీసిన రసం కొద్దిగా అల్లం రసంలో కలిపి తీసుకుంటే రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. కీటకాలు విష పురుగులు విషయాన్ని ఇరుగుడుగా కూడా పనిచేస్తుంది. ఈ ఆకుల రసం. మారేడు బెరడు, వేర్లు,ఆకులు ముద్దగా నూరి గాయాల మీద పెడితే గాయాలు తొందరగా తగ్గిపోతాయి.

Exit mobile version