Hungry: సరిగా ఆకలి వేయడం లేదా.. అయితే ఇలా చేస్తే చాలు ఆకలి దంచేయడం ఖాయం?

ఆహారం ఎంత బాగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు అని వైద్యులు పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎప్పుడూ ఆకలిగా లేదు తినాలనిపించడం లేదు

  • Written By:
  • Publish Date - January 25, 2024 / 07:00 PM IST

ఆహారం ఎంత బాగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు అని వైద్యులు పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎప్పుడూ ఆకలిగా లేదు తినాలనిపించడం లేదు అంటూ ఆహారాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. పెద్దలు మాత్రమే కాకుండా చిన్న పిల్లలు ఈ విధంగా ఆకలిగా లేదు అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆకలి కావడం లేదు నాకు వద్దు అంటూ మారాం చేస్తూ ఉంటారు. ఆకలి బాగా ఉంటే ఎలాంటి ఆహార పదార్థాలు అయినా సరే ఇష్టంగా తింటూ ఉంటారు. ఆకలిగా అనిపించకపోతే ఇష్టమైన ఆహారాన్ని కూడా వద్దు అని పక్కన పెట్టిస్తూ ఉంటారు. అలాగే బాగా తినే వారికి తరచూ ఆకలి వేయడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ఆక‌లి త‌గ్గితే ఆందోళ‌న ,డిప్రెష‌న్ , ఒత్తిడి, వంటి ఆనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. త‌ద్వారా భ్యాక్టిరియా ఇన్ఫెక్షన్స్ , కిడ్ని స‌మ‌స్య‌లు, డెమెంటియా, వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అయితే ఆక‌లి లేక‌పోవ‌డం వ‌ల‌న బ‌రువుని చాలా త్వ‌ర‌గా కొల్పోతారు. అయితే ఆకలి బాగా అవ్వడం కోసం చాలామంది రకరకాల సిరప్ లను తాగుతూ ఉంటారు. కానీ అలా కాకుండా ఆకలి బాగా అయ్యి ఆహారం బాగా తినాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆకలిని పెంచడంలో నల్ల మిరియాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ మిరియాల‌ను తిసుకొవడం వ‌ల‌న గ్యాస్ ప్రాబుల‌మ్స్ రాకూండా చేస్తాయి. అంతే కాదు జిర్ణ‌శ‌క్తిని పెరిగేలా చేసి ఆక‌లి బాగా అయ్యెలా చేస్తాయి.

ఇందులో ఉండే ఔష‌ధ‌ గుణాలు వల్ల వ‌ల‌న మ‌న‌కు రుచిక‌ళిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తాయి. కావునా జీర్ణాశ‌యంలో యాసిడ్ల ఉత్ప‌త్తిని పెంచుతుంది. దిని వ‌ల‌న జీర్ణశ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది. అందుకోసం ఒక టీ స్పూన్ బెల్లం పోడి , అర టీ స్పూన్ మిరియాల పొడి క‌లిపి రోజూ ఒక్క‌సారి తినాలి. ఇలా కొద్ది రోజులు పాటు తింటూ ఉండటం వల్ల ఆకలి బాగా వేయడంతో పాటు ఆహారం కూడా సమయానికి భోజనం చేయగలుగుతారు. యాలకులు కూడా ఆకలి అవ్వడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అందుకోసం రోజూ ఉద‌యం, సాయంత్రం స‌మ‌యంలో భోజ‌నానికి మందు ఒక‌టి లేదా మూడు యాల‌కుల‌ను అలాగే న‌మిలి మింగాలి. ఇలా చేయ‌డం వ‌ల‌న ఆక‌లి బాగా అవుతుంది.

అలాగే మ‌నం టీ కొసం డీకాష‌న్ ను కాసిన‌ప్పుడు అందులో ఒక‌టి లేదా మూడు యాల‌కును ధంచి వేయ‌డం వ‌ల‌న మంచి సువాస‌న‌తో పాటుగా మంచి రూచి కూడా ఉంటుంది. ఇలా చేయ‌డంవ‌ల‌న కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అల్లం కూడా ఆకలిని పెంచడంలో ఎంత బాగా పనిచేస్తుంది. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ అల్లం వ‌ల‌న మ‌న‌కు క‌డుపు నొప్పిని త‌గ్గిస్తుంది. అంతే కాదు ఆక‌లి పెర‌గ‌టంలో కూడా ఇది చాలా అద్భుతంగా ప‌నిచేస్తుంది. అజీర్తి సమస్యల నుంచి బయట పడేస్తుంది. అలాగే సైంధ‌వ ల‌వ‌ణంను కొంచం తీసుకొని అందులో ఒక అర టీ స్పూను అల్లం ర‌సం క‌లిపి రోజూ భోజ‌నానికి ఒక అర గంట త‌రువాత తీసుకోవాలి. ఇలా 10 రోజూల పాటు ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఉసిరి,వాము వంటివి కూడా ఆకలిని పెంచడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి.