Health Tips: మొలల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే మజ్జిగలో అది కలిపి తీసుకుంటే చాలు?

ఫైల్స్ సమస్య.. ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ సమస్

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 07:45 PM IST

ఫైల్స్ సమస్య.. ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ పైల్స్ సమస్య వర్ణనాతీతం. మలవిసర్జన చేసే సమయంలో నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. ఈ ఫైల్స్ సమస్యను తగ్గించుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంకొందరు మొలలు తట్టుకోలేక ఆపరేషన్లు కూడా చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రమే హోమ్ రెమిడీలను ఫాలో అయ్యి ఆ సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు.

అయితే మీరు కూడా మొలల సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మనం తెలుసుకోయే రెమిడిని పాటిస్తే చాలు ఎలాంటి ఫైల్స్ అయినా కూడా తగ్గిపోవాల్సిందే. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంతకీ ఈ మొలల సమస్య ఎందుకు వస్తుంది అన్న విషయాన్ని వస్తే.. ఫైల్స్ సమస్య ఉన్నవారు మల విసర్జనకి గంటలు కొద్దిగా కూర్చోవడం అలాగే మలంలో బ్లడ్ రావడం నొప్పి, మంట కూర్చున్నప్పుడు ముళ్ళు మీద కూర్చున్నట్లుగా భావన కలగడం ఉంటుంది. ఈ సమస్యను భరించడం చాలా కష్టం. ఈ మొలల సమస్య రావడానికి మనం తినే ఆహార పదార్థాలు కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

అయితే ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మన కిచెన్ లో దొరికే వామును తీసుకొని బాగా దంచుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాసు మజ్జిగ లో పావు చెంచా వేసి అలాగే దానిలో నల్ల ఉప్పు కొద్దిగా వేసి బాగా కలిపి ఈ మజ్జిగను నిత్యం రెండు గ్లాసులు తీసుకుంటూ ఉండాలి. నిత్యం తాగినట్లయితే ఈ సమస్య ఈజీగా తగ్గిపోతుంది. ఎప్పటి నుంచో బాధపడుతున్న ఫైల్స్ సమస్య వారం రోజుల్లో ఈజీగా తగ్గిపోతుంది. ఈ మజ్జిగ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాము అనేది మలబద్ధకం సమస్య నుంచి తగ్గించి విరోచనం ఈజీగా వెళ్లేలా చేస్తుంది. అదేవిధంగా నల్ల ఉప్పు కూడా మలబద్ధక వ్యాధులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అదేవిధంగా ఫైల్స్ తో ఇబ్బంది పడేవారు మసాలాలు, కారాలకు కొద్దిగా దూరంగా ఉండటం మంచిది.