Site icon HashtagU Telugu

Health Tips: మిల్క్ టీ, బ్లాక్ టీ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

Health Tips

Health Tips

చాలామందికి ఉదయం లేవగానే కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది టీ తాగితే మరి కొంతమంది కాఫీ లేదా బ్లాక్ టీ మిల్టీ వంటివి తాగుతూ ఉంటారు. అయితే మనలో ఎక్కువ శాతం మంది మిల్క్ టీ లేదా బ్లాక్ టీ తాగుతూ ఉంటారు. ఈ రెండు తాగినప్పుడు చాలామందికి ఈ రెండింటిలో ఏది మంచిది? ఏది ఆరోగ్యానికి మంచి చేస్తుంది అన్న సందేహం కలిగే ఉంటుంది. మరి ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫ్లేవనాయిడ్లు, కాటెచిన్స్ వంటి పాలీఫెనాల్స్ మెండుగా ఉంటాయి.

ఈ సమ్మేళనాలు మనల్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. బ్లాక్ టీని రెగ్యలర్ గా తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. బ్లాక్ టీలో ఉండే కెఫిన్ కంటెంట్ మన నిద్రమత్తును వదిలిస్తుంది. అలాగే అభిజ్ఞా పనితీరును కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. బ్లాక్ టీలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే సమ్మేళనాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీలో ఉండే పాలీ ఫెనాల్స్ యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయని చెబుతున్నారు. బ్లాక్ టీలోని టానిన్ జీర్ణక్రియపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందట.

ఇవి పేగు మంటను తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తాయట. కాగా బ్లాక్ టీ లో ఉండే పాలీఫెనాల్స్ జీవక్రియను పెంచుతాయి. దీంతో కొవ్వు శోషణ తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మిల్క్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే.. మిల్క్ టీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. ఈ టీ మన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా మొత్తం శ్రేయస్సుకు ప్రయోజనకరంగా ఉంటుందట. ఈ టీలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయట. మిల్క్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. కాగా మిల్క్ టీలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది అప్రమత్తత, అభిజ్ఞా పనితీరును పెంచుతుందని చెబుతున్నారు. ఇకపోతే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అన్న విషయానికి వస్తే.. బ్లాక్ టీ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. నిజానికి బ్లాక్ టీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయెజనకరంగా ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం రోజుకు కనీసం రెండు కప్పుల బ్లాక్ టీ తాగడం వల్ల ఏదైనా కారణంతో మరణించే ప్రమాదాన్ని 9 నుంచి 13 శాతం తగ్గించవచ్చు అని చెబుతున్నారు. మిల్క్ టీలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ టీలో షుగర్ ఎక్కువగా ఉంటే జీర్ణ సమస్యలు కూడా వస్తాయట.