Site icon HashtagU Telugu

Health Tips: వీటిని నానబెట్టి తింటే చాలు ఈజీగా బరువు తగ్గడం ఖాయం!

Mixcollage 15 Mar 2024 06 51 Pm 1440

Mixcollage 15 Mar 2024 06 51 Pm 1440

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ అధిక బరువు సమస్య కారణంగా చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొందరు అయితే వారి పనులు వారు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే నలుగురిలోకి వెళ్ళాలి అన్నా కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ వస్తాయని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక అధిక బరువు సమస్యను తగ్గించుకోవడం కోసం చాలామంది ఎన్నో రకాల వ్యాయామాలు ఎక్సర్సైజ్ లు డైట్లు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించకపోవడంతో దిగులు చెందుతూ ఉంటారు.

అందుకోసం వైద్యులు ఒక చక్కటి రెసిపీని చెప్పారు. ఇంతకీ బరువు తగ్గాలంటే ఏం చేయాలో అందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..బరువు తగ్గడానికి అనేక పద్ధతులను చాలామంది అనుసరిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలామంది జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. కొన్ని నానబెట్టిన ఆహారపదార్థాలను తింటే బరువు తగ్గుతారట. ఇందుకోసం నానబెట్టిన వేరుశనగలు పరగడుపున తింటే బరువు తగ్గుతారనట. వేరుశనగలు రాత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఇది బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాల్ నట్ లను ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన వాటిని తింటే ఈజీగా బరువు తగ్గుతారు. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే నానబెట్టిన వాల్ నట్లను తినడం వల్ల అతిగా ఆహారం తినకుండా ఉంటారు. ఇది బరువును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

అదేవిధంగా నీళ్లలో నానబెట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత నీళ్లలో నానబెట్టిన బాదం పప్పును పైన పొట్టు తీసి తినడం వల్ల బరువు తగ్గుతారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎండు ద్రాక్షను తినడం వల్ల కూడా బరువు ఈజీగా తగ్గుతారు. ఎండు ద్రాక్ష తినడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఎండు ద్రాక్ష జీవక్రియను బలోపేతం చేస్తుంది. బరువు నిర్వహణలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంజీర పండ్లను రాత్రంతా నానపెట్టి, ఉదయం పరగడుపున తింటే ఇది ప్రభావవంతంగా బరువును తగ్గిస్తుంది. అంజీర పండ్లలో ఉండే పోషకాలు మన శరీరంలోని కొవ్వు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత పైన పేర్కొన్న వాటిని ఆహారంగా తీసుకుంటే బరువు ఈజీగా తగ్గుతారు.