Sleep: రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే జాగ్రత్త?

  • Written By:
  • Updated On - March 11, 2024 / 04:22 PM IST

కాలం మారిపోవడంతో కాలానికి అనుగుణంగా మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి అన్నీ మారిపోయాయి. దానికి తోడు అనారోగ్య సమస్యల బాధపడే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. సమయానికి సరిగా భోజనం చేయక నిద్రపోక ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో అయితే చాలామంది అర్ధరాత్రి ఒంటిగంట రెండు గంటల సమయం వరకు మేలుకొని ఆ సమయంలో నిద్ర పోతున్నారు. ఇలా లేట్ నైట్ నిద్రపోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలా పడుకోవడం మంచిది కాదు అని వైద్యులు చెప్పినప్పటికీ వినిపించుకోవడం లేదు.

మరి లేట్ నైట్ నిద్రపోతే ఇలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, విపరీతమైన ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం, మొబైల్ ఫోను ఎక్కువగా వినియోగించడం వంటి కారణాలు నిద్రలేమి సమస్యను కలిగిస్తాయి. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనేక అనర్ధాలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి ఒక్కరు సాధారణంగా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. అలా నిద్రపోలేని వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. సరిపడినంత నిద్రపోని వారి కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చి ముఖం అందవిహీనంగా మారుతుంది. నిద్ర సరిగ్గా పని వారిలో కోపం, చిరాకు, విసుగు పెరుగుతాయి. నిరుత్సాహం వారిని ఆవహిస్తుంది.

ప్రతి చిన్న విషయానికి చిరాకు పడతారు. రక్తపోటు పెరుగుతుంది. వారు ఏ పనినీ సమర్ధవంతంగా చెయ్యలేరు. ఇక శరీర తీరును బట్టి కొంతమందికి నిద్రపోకపోతే బరువు తగ్గుతారు. ఇంకొంతమంది నిద్రపోకపోతే బరువు పెరుగుతారు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల తొందరగా నిద్ర పట్టదు. ఉదయాన్నే లేవాలంటే తలంతా పట్టేసినట్టుగా ఇబ్బందిగా ఉంటుంది .బద్దకంగా అనిపిస్తుంది. ఆలస్యంగా నిద్రలేవడం వలన ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి ఆయుషు కూడా తగ్గిపోతుంది. నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలే కాకుండా చర్మ సమస్యలు కూడా వస్తాయి. చర్మం నిగారింపు తగ్గుతుంది. నిద్ర సరిగా లేకపోతే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చిన్న చిన్న అలెర్జీలను కూడా తట్టుకునే శక్తి కూడా శరీరానికి ఉండదు. ఇక నిద్రలేమి సమస్య దీర్ఘకాలం ఉంటే గుండె పోటు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. గుండెకు రక్త సరఫరా నిదానించటం, వాల్వ్ లు ఫెయిల్ అవ్వడం వంటివి సంభవిస్తాయి. కాబట్టి నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి.