Health Tips: మీ ఇంటి పరిసరాల్లో ఈ మొక్క కనిపించిందా.. అయితే అసలు వదలకండి?

ప్రకృతి మనకు ఎన్నో రకాల మొక్కలను ప్రసాదించింది. అందులో కొన్నింటిని మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. చాలా రకాల మొక్కల గురించి వాటి విలువల గురించి

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 06:30 PM IST

ప్రకృతి మనకు ఎన్నో రకాల మొక్కలను ప్రసాదించింది. అందులో కొన్నింటిని మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. చాలా రకాల మొక్కల గురించి వాటి విలువల గురించి తెలియక వాటిని పిచ్చి మొక్కలుగా భావించి పీకి పడేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొక్క కూడా ఒకటి. ఈ మొక్క డాక్టర్లకు సైతం ఛాలెంజ్ చేస్తోంది. ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తూ వైద్యులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొక్క మీ ఇంటి పరిసరాల్లో తప్పకుండా ఉండే ఉంటుంది. ఒకవేళ మీకు ఆ మొక్క కనిపించింది అంటే పొరపాటున కూడా దానిని అసలు వదలకండి.

ఎందుకంటే ఆ మొక్క వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్క గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ మొక్క ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే నిజానికి ఇది తగ్గించని వ్యాధి లేదు అని కూడా చెప్పవచ్చు. ఆ మొక్క మరేదో కాదండోయ్.. కుప్పింట చెట్టు. వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది ఇది. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒక రకం జాతి మొక్క ఆకులు గుండ్రంగా ఉంటాయి. రెండవది ఆకులు చివరకు ఉంటాయి. ఈ రెండు రకాల చెట్లు సమాన గుణాలు కలిగి ఉంటాయి. పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో కుప్పింటాకును ఉపయోగిస్తున్నారు.

ఈ మొక్క ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల శ్వాసకోస సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకు రసాన్ని తీసుకొని అందులో నిమ్మ రసాన్ని కలిపి చర్మానికి రాసుకోవడం వల్ల గజ్జి, తామర వంటి వాటితో పాటు దురదలు దద్దుర్లు కూడా తగ్గుతాయి. ఆయుర్వేద నిపుణులు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కుప్పింట మొక్కను వాడుతున్నారు. ఈ మొక్క ఆకులను మెత్తగా చేసి అందులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే అవాంఛత రోమాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ మొక్క కనిపిస్తే తెచ్చి కాస్త మెత్తగా దంచి చర్మానికి అప్లై చేయండి. లేదంటే కాస్త కషాయం తయారు చేసుకొని తాగిన కూడా చాలా రకాల రోగాలు నయమవుతాయి. ఒకవేళ ఈ మొక్కను వాడాలి అనుకున్న వారు మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం మంచిది.