Site icon HashtagU Telugu

Showering: తరచూ వేడి నీటితో తలస్నానం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

Mixcollage 03 Jul 2024 07 57 Am 5182

Mixcollage 03 Jul 2024 07 57 Am 5182

ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు హెల్తీగా ఉంటారు. అయితే కొందరు వేడినీళ్లతో స్నానం చేస్తే మరికొందరు చల్ల నీటితో స్నానం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు స్నానం చేయడం మంచిదే అయినప్పటికీ వేడి నీళ్లతో చేస్తే మంచిదా, లేకపోతే చల్లనీలతో చేస్తే మంచిదా? అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా చలికాలంలో ప్రజలు వేడి నీటితోనే ఎక్కువగా తల స్నానం చేస్తూ ఉంటారు. వేసవికాలంలో చన్నీళ్ళతో స్నానం చేస్తారు. చలికాలంలో వేడినీళ్ళతో స్నానం చేస్తుంటారు.

అది మంచిదే కానీ వేడినీళ్ళతో తలస్నానం చేయటం జుట్టుకు హాని కలిగిస్తుంది. అయితే గోరు వెచ్చని నీటిని తలపై పోసుకోవటం హానికరం కాదు అని చెప్తున్నారు వైద్యులు. ఎందుకంటే మీరు తల స్నానం చేయాలి అనుకుంటే అంత చల్లగా కాదు మరీ అంత వేడిగా కాకుండా గోరువెచ్చని నీటితో తల స్నానం చేయడం మంచిది అంటున్నారు. మరి వేడి నీటితో తల స్నానం చేస్తే ఏం జరుగుతుంది అన్న విషయానికొస్తే.. వేడినీళ్ళతో తల స్నానం చెయ్యటం వలన జుట్టు పొడిబారటం, వెంట్రుకలు చిట్లిపోవటం, వెంట్రుకలు నిర్జీవం కావటం మొదలవుతాయట. వేడి నీటితో తలస్నానం చేయటం వలన స్కాల్ప్ రంధ్రాలు తెరుచుకుని, జుట్టు మూలాలలో బలహీనపడుతుందట. వేడినీళ్లలో జుట్టు కడుక్కోవడం వల్ల జుట్టులో ఉండే కెరాటిన్ ప్రోటీన్ కరిగిపోయి జుట్టు డ్యామేజ్ అవుతుంది.

ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల నెమ్మదిగా జుట్టు బలహీనపడడంతో పాటు హెయిర్ ఫాల్ మొదలవుతుంది. బాగా వేడి నీళ్లతో జుట్టును కడగడం వల్ల స్కాల్ప్ మొత్తం ఎర్రగా మారుతుంది. తలపై చిరాకు, చుండ్రు పెరుగుతుంది. బాగా వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని తేమ తగ్గుతుంది. ఫలితంగా జుట్టు పొడిగా గరుకుగా, చిరాకుగా మారుతుంది. జుట్టును నిరంతరం వేడి నీళ్లతో కడుక్కోవడం వల్ల కూడా స్కాల్ప్ లో పొడిదనం పెరుగుతుంది. కాబట్టి తల స్నానం చేయాలి అనుకున్న వారు మరి అంత చల్లనీటితో కాకుండా మరి అంత వేడి నీళ్లతో కాకుండా గోరువెచ్చగా ఉన్న నీటితో తల స్నానం చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటున్నారు వైద్యులు. (నోట్ :ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినవి)

Exit mobile version