Health Tips: సాయంత్రం పూట టీ తాగకూడదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

భారతదేశంలో టీ తాగే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఉదయం లేవగానే చాలామంది టీ తాగు

  • Written By:
  • Publish Date - June 29, 2024 / 09:12 PM IST

భారతదేశంలో టీ తాగే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఉదయం లేవగానే చాలామంది టీ తాగుతూ ఉంటారు. చాలామందికి టీ తాగనిదే రోజు కూడా గడవదు. అంతేకాకుండా టీ తాగకుండా చాలామంది ఏ పని కూడా మొదలు పెట్టరు. రోజులో కనీసం ఒక్కసారి అయినా టీ లేదా కాఫీ తాగాల్సిందే. అయితే టీ తాగడం మంచిదే కానీ, కొన్ని సమయాల్లో టీ తాగడం మంచిది కాదు అలాగే మోతాదుకు ముంచి టీ తాగడం అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టీ తాగేవారు ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే టీ తాగాలి. ఇక అతిగా టీ తాగితే మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. చాలామంది పనుల ఒత్తిడి కారణంగా ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగుతూనే ఉంటారు. రోజుకు చాలాసార్లు టీ తాగేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అటువంటి వారు ఎక్కువగా టీ తాగకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక సాయంత్రం పూట టీ తాగడం అస్సలు మంచిది కాదు. సాయంత్రం పూట టీ తాగడం వల్ల శరీరంపై కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయట. భారతదేశంలో ఉన్న జనాభా 64% మంది ప్రతిరోజు టీ తాగడానికి ఇష్టపడతారు.

అందులో 30 శాతం కంటే ఎక్కువ మంది సాయంత్రం ఖచ్చితంగా టీ తాగుతారు. అయితే సాయంత్రం టీ తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్ర సమయంలో టీ తాగడం వల్ల టీలో ఉండే కెఫిన్ కారణంగా నిద్రలేమి సమస్యలు, లివర్ డిటాక్స్ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు, ఇన్ఫ్లమేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పడుకోవడానికి పది గంటలు ముందు కచ్చితంగా టీకి దూరంగా ఉండాలి సాయంత్రం సమయంలో టీ తాగొచ్చు. కానీ టీ తాగడం ఒక అడిక్షన్ లా చేసుకొని పదే పదే టీ తాగడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిదికాదు. ముఖ్యంగా సాయంత్రం వేళ టీ తాగకుండా మానేస్తేనే ఆరోగ్యానికి మంచిది.