Insomnia: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న తెలిసిందే. రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టక అనేక రకాల సమస్యలు బారిన పడుతున్నారు. అంతేకాకుండా

Published By: HashtagU Telugu Desk
Mixcollage 19 Mar 2024 08 05 Pm 7367

Mixcollage 19 Mar 2024 08 05 Pm 7367

ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న తెలిసిందే. రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టక అనేక రకాల సమస్యలు బారిన పడుతున్నారు. అంతేకాకుండా రాత్రిళ్ళు నిద్రపోవడానికి ఒక చిన్నపాటి యుద్ధం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక నిద్ర పట్టడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా పట్టగా ఇబ్బంది పడుతున్న వారు వాటి వెనుక విషయాలు ఏంటో తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంటే ఎందుకు నిద్ర పట్టడం లేదు దాని వెనుక ఉన్న కారణం ఏంటి అన్న వివరాలు కూడా తెలుసుకోవాలి.

నిద్ర లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతం చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్య కారణంగా దినచర్య కూడా దెబ్బతింటుంది. చేసే పనిలో ఉత్పాదకత తగ్గుతుంది. మంచి గాఢమైన నిద్రను పొందకపోతే, అందుకు ఇతర కారణాలతో పాటు మీ శరీరంలో విటమిన్ లోపం కూడా కారణం అయ్యి ఉండవచ్చు. అసలు ఏ విటమిన్ లోపిస్తే నిద్రలేమి సమస్య వస్తుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మెలటోనిన్ , సెరటోనిన్ అనే హార్మోన్లు మంచి నిద్రకు కారణంగా భావిస్తారు. విటమిన్ బి6 ఈ రెండు హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది.

విటమిన్ బి 6 ఉన్న ఆహారాన్ని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే మంచి నిద్ర వస్తుంది. విటమిన్ బి6 లోపం వల్ల శరీరంలో కారణమైన మెలటోనిన్, సెరోటోనిన్ హార్మోన్ల స్రావం తగ్గుతుంది. దీనివల్ల మనిషి రాత్రిపూట సరిగా నిద్ర పోలేరు. మంచి నిద్ర పోవాలంటే విటమిన్ బి 6 తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజు పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగితే విటమిన్ బి 6 పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు వేరుశనగ, చికెన్, ఓట్స్, బాదం వంటి వాటిలో కూడా విటమిన్ b6 ఉంటుంది. ఇక మంచి నిద్ర కోసం విటమిన్ బి6 సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినడంతో పాటుగా యోగాను, వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలి. అలాగే బాగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. అప్పుడే మన హాయిగా నిద్రపో గలుగుతాం. మంచి నిద్ర మనలను ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

  Last Updated: 19 Mar 2024, 08:06 PM IST