Site icon HashtagU Telugu

Chilgoza seeds: చిల్గోజా గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు?

Chilgoza Seeds

Chilgoza Seeds

డ్రై ఫ్రూట్స్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి అన్న విషయం తెలిసిందే. నిపుణులు సైతం డ్రై ఫ్రూట్స్ ని తినమని సలహా ఇస్తూ ఉంటారు. అందుకే చాలామంది వారి ధైర్యం దిన జీవితంలో ఆహారంతో పాటు డ్రై ఫ్రూట్స్ ని కూడా తినడం అలవాటుగా నేర్చుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి డ్రై ఫ్రూట్స్ అనగానే జీడిపప్పులు బాదం పప్పులు లాంటివి గుర్తుకు వస్తూ ఉంటాయి. కానీ డ్రై ఫ్రూట్స్ లో చాలామందికి తెలియని ఒక డ్రై ఫ్రూట్ ఉంది. దానిని ఫైన్ నట్ లేదా చిల్గోజా అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ చిల్లోజా అనే డ్రైఫ్రూట్ ని తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చిల్గోజా డ్రై ఫ్రూట్లో జీడిపప్పు, బాదం ల కంటె ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. చిల్గోజా తో పాటుగా చిల్గోజా నూనెను కూడా ఆయుర్వేదంలో అనేక ఔషధాలలో ఉపయోగిస్తారు. చిల్గోజా తినడం వల్ల శరీరానికి ఎంతో బలం రావడంతో పాటు బలహీనత తొలగిపోతుంది.చలికాలంలో చిల్గోజా తినడం వల్ల శరీరానికి కావలసిన వెచ్చదనం వస్తుంది. ఈ డ్రై ఫ్రూట్ ని తినడం వల్ల శరీరంలోని ఎముకలు దృఢంగా మారి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనిని తినడం వల్ల దగ్గు, ఉబ్బసం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

బలహీనత సమస్యతో బాధపడేవారు చిల్గోజా ప్రతిరోజు 5-6 తినడం వల్ల మంచిది. మీ చిల్లో జా గింజలు అలాగే వాటి నూనె కీళ్ల నొప్పులు,ఒళ్ళు నొప్పులు తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే చలికాలంలో వెచ్చదనాన్ని కోరుకునేవారు ఈ డ్రై ఫ్రూట్స్ ని తినడం మంచిది.