Milk: ఎక్కువసేపు పాలను మరిగిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

మామూలుగా చాలామంది స్త్రీలు పాలను ఎక్కువ సేపు మరిగిస్తూ ఉంటారు. పాలు పచ్చివాసన పోయే పోవాలని ఎక్కువసేపు మరగబెడితే మరికొందరు పాలపై మీగడ బా

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 05:00 PM IST

మామూలుగా చాలామంది స్త్రీలు పాలను ఎక్కువ సేపు మరిగిస్తూ ఉంటారు. పాలు పచ్చివాసన పోయే పోవాలని ఎక్కువసేపు మరగబెడితే మరికొందరు పాలపై మీగడ బాగా కట్టాలి అని ఎక్కువసేపు మరగబెడుతూ ఉంటారు. ఇంకొందరు పాలు బాగా మరిగిస్తే రుచిగా ఉంటాయని పెరుగు కూడా బాగా రుచి ఉంటుందని చెబుతూ ఉంటారు.
బాగా మ‌రిగించిన పాలు తోడు పెట్ట‌డం వ‌ల‌న వెన్నెను కూడా బాగా వ‌స్తుంది. పాలల్లో పోషకాలు ప్రోటీన్లు విటమిన్లు క్యాల్షియం అధికంగా ఉంటాయి. పాలను తరచుగా తీసుకోవడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. అందులో ఉండే క్యాల్షియం ఎముకలు అరిగిపోకుండా ఎముకలకు మరింత శక్తిని ఇస్తుంది.

పాల‌ను తాగ‌డం వ‌ల‌న మ‌న శ‌రిరం దృఢంగా మ‌రియు ఆరోగ్యంగా త‌యార‌వుతుంది. అయితే పాల‌ను మ‌రిగించే విష‌యంలో కొందరు తెలియక కొన్ని రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో పాలను ఎక్కువ సేపు మరిగించడం కూడా ఒకటి. పాల‌ను ఎక్కువ‌సేపు మ‌రిగించ‌డం వ‌ల‌న అందులో ఉన్న పోష‌కాలు న‌శించిపోతాయి. కొంతమంది కొద్దిసేపు కాగబెట్టి పొంగు రాగానే వెంటనే ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయ‌వడం మంచి పద్ధతి. కొంతమంది మొదట్లో పాలు బాగా మరిగించలేదని పదే పదే వాటిని బాగా మరిగిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు నశించిపోతాయి. అలాంటి పాలు తాగినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు.

అలాగే పాలను పదేపదే మరగబెట్టకూడదు. ఎక్కువ ఒకవేళ వేడి చేయాల్సి వస్తే కొంచెం వేడి చేయాలి అంతేకానీ ఎక్కువ సేపు మరగబెట్టడం వల్ల అందులో ఉండే పోషకాలు నశించిపోయి అలాంటి పాలు తాగిన కూడా ఎటువంటి ప్రయోజనాలు కలగవు. అలాగే కొన్ని రకాల పదార్థాలు తీసుకున్న తర్వాత కూడా పాలను తాగకూడదు. వంకాయ కూర‌ను, ఉల్లిపాయ‌ల‌ను వంటివి తిన్న‌ప్పుడు పాల‌ను వేంట‌నే తాగ‌కూడదు. కొద్ది స‌మ‌యం ఉండి ఆ తర్వాత తాగడం మంచిది. వేంట‌నే తాగ‌డం వ‌ల‌న చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మాంసాహ‌రంలు తిన్న‌పుడు కూడా వేంట‌నే పాల‌ను తాగ‌డం వ‌ల‌న చ‌ర్మంపై ప్యాచులు ఏర్ప‌డ‌తాయి. రాత్రి నిద్రించే ముందు పాలు తాగడం మంచిది. రాత్రి సమయంలో పాలు తాగడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. భోజనం తర్వాత పాలు తాగే అలవాటు ఉంటే వెంటనే తాగకుండా కొంచెం విరామం ఇచ్చి తాగడం మంచిది. ఇలా చేయ‌డం వ‌ల‌న జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.